AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నైరుతి తిరోగమనం..ఆందోళనలో రైతన్నలుఈ ఏడాది కరువు తప్పదా?

నైరుతి తిరోగమనం..ఆందోళనలో రైతన్నలుఈ ఏడాది కరువు తప్పదా?

Samatha J
|

Updated on: Oct 06, 2026 | 1:00 PM

Share

ఎల్‌నినో ప్రభావం, రుతుపవనాల తిరోగమనంతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణ వర్షపాతం తగ్గడం, భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పూతాపిందె రాలిపోవడం, వరి సాగు తగ్గడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే, రాబోయే రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది.

తెలుగు రాష్ట్రాలపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా పడగ విప్పుతోంది. వానాకాలం ముగింపు దశకు చేరుకున్నా, వేసవిని తలపించేలా అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో ఈ సీజన్‌లో సాధారణం కంటే వర్షపాతం భారీగా తగ్గడంతో రైతాంగం కుదేలవుతోంది. భూగర్భ జలాలు వేగంగా పడిపోవడం, అధిక ఉష్ణోగ్రతల వల్ల పూతాపిందె రాలిపోవడంతో వేసిన పంట చేతికి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. చాలా ప్రాంతాల్లో వరి సాగు గణనీయంగా తగ్గిపోయింది. ఏపీలోని 21 జిల్లాల్లోని 388 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ఎల్‌నినో ప్రభావం వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో నీటి మట్టాలు తగ్గడంతో ప్రాజెక్టులు నిండలేదు. ప్రజారోగ్యంతో పాటు వ్యవసాయం పైనా ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. అక్టోబర్ నెలలోనూ వేడిమి, తాగునీటి సమస్యలు పెరుగుతుండటం ముందు ముందు మరింత కఠిన పరిస్థితులు తప్పవని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధిక నీరు అవసరమయ్యే వరి సాగు తగ్గించి, ఆరుతడి పంటలు వేసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం :

ఒకే నెలలో రెండు సినిమాలతో సందడి చేస్తున్న సాయి పల్లవి

కన్‌ఫ్యూజన్‌లో కన్నడ హీరోలు..ఎందుకంటే?

బాలీవుడ్‌లో సినిమా తీయటం అంత ఈజీ కాదన్న అజయ్‌ దేవగన్‌

ఆకతాయిలకు జూనియర్ వార్నింగ్‌… ఎవ్వరినీ వదిలిపెట్టనన్న ఎన్టీఆర్‌..

రణబాలి కథ రివీల్ చేసిన దర్శకుడు!

Published on: Oct 06, 2026 12:59 PM
Follow Us