డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మెరకపాలెంలో అరుదైన ప్రకృతి వింత చోటుచేసుకుంది. రైతు ఎలమర్తి బాబూరావు పొలంలో ఒకే అరటి చెట్టుకు ఏకంగా ఏడు అరటి గెలలు కాశాయి. ఈ వింతను చూసేందుకు స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు. ఈ దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.