రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రాబోతున్న వారణాసి చిత్రంపై మరో ఆసక్తికర అప్డేట్ వచ్చింది. బ్రిటిష్ నటి డైసీ ఎడ్గర్-జోన్స్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో RRR కోసం సంప్రదించిన రాజమౌళి, ఇప్పుడు వారణాసితో ఆమెను భారతీయ చిత్రసీమకు పరిచయం చేయనున్నారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.