AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలసట, నీరసంగా అనిపిస్తోందా? మందులు వద్దు.. పూర్వీకుల శక్తివంతమైన ఫుడ్ తీసుకోండి..

Natural Foods: శరీరానికి సహజ శక్తి, అవసరమైన పోషకాలు అందించేందుకు పండ్లు, మొలకెత్తిన పెసలు, శనగలు, నానబెట్టిన నట్స్, విత్తనాలు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవచ్చు. ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించి సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. నీరసం తగ్గి బలంగా మారడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూడండి..

అలసట, నీరసంగా అనిపిస్తోందా? మందులు వద్దు..  పూర్వీకుల శక్తివంతమైన ఫుడ్ తీసుకోండి..
Natural Foods For Energy
Shaik Madar Saheb
|

Updated on: Oct 07, 2026 | 7:56 AM

Share

శారీరక శక్తిని, మానసిక ఉత్తేజాన్ని పెంపొందించడంలో, అలాగే రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహజసిద్ధమైన ఆహారాల పాత్ర ఎంతో కీలకమని ఆరోగ్య నిపుణులు, ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆధునిక జీవనశైలిలో నీరసం, అలసట సర్వసాధారణంగా మారిన ఈ తరుణంలో, ప్రకృతి ప్రసాదించిన ఆహార పదార్థాలు ఎలా మనకు బలాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయో ఈ కథనంలో తెలుసుకుందాం..

సహజ ఆహారాల ప్రత్యేకత

ప్రకృతి అందించే ఆహారాలన్నీ, వాటి సహజ రూపంలో ఉన్నప్పుడు, శరీరం వాటిని సులభంగా జీర్ణం చేసుకుని, పోషకాలను సమర్థవంతంగా గ్రహిస్తుంది. ఏ విధమైన మార్పులు, చేర్పులు లేకుండా తీసుకునే ఈ ఆహారాలు శరీరంపై ఎటువంటి భారాన్ని మోపవు. వండిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలను జీర్ణం చేయడానికి శరీరం చాలా శక్తిని వినియోగించాల్సి ఉంటుంది. కానీ సహజ ఆహారాల విషయంలో ఈ శక్థి వ్యర్థం కాదని ఆయుర్వదే నిపుణులు చెబుతున్నారు.. అవి శరీరానికి కేవలం ఇచ్చే గుణం మాత్రమే కలిగి ఉంటాయని.. ఈ కారణంగానే వీటిని ఎనర్జీ గెయినింగ్ ఫుడ్స్ అని పిలుస్తారని చెబుతన్నారు.

శక్తినిచ్చే ముఖ్యమైన సహజ ఆహారాలు

పండ్లు: పండ్లు నేరుగా శక్తిని అందించే అద్భుతమైన వనరులు. ఎంత ఎక్కువగా పండ్లు తింటే అంత ఎక్కువ శక్తిని శరీరం గ్రహిస్తుంది. వీటిలో ఉండే సహజసిద్ధమైన చక్కెరలు, విటమిన్లు, ఖనిజాలు తక్షణ శక్తిని అందిస్తాయి.

నానబెట్టిన, మొలకెత్తిన విత్తనాలు: విత్తనాలను నానబెట్టి, మొలకెత్తించి తినడం ద్వారా వాటి పోషక విలువలు రెట్టింపవుతాయి. ఇవి ప్రొటీన్లు, కొవ్వులు, పిండి పదార్థాలతో నిండి ఉంటాయి. పెసలు, శనగలు వంటి మొలకెత్తిన ధాన్యాలు, అలాగే నానబెట్టిన బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్‌నట్స్, వేరుశనగపప్పు, గుమ్మడి గింజలు (పమ్ప్‌కిన్ సీడ్స్), పుచ్చకాయ గింజలు (వాటర్ మెలన్ సీడ్స్), పొద్దుతిరుగుడు గింజలు (సన్ ఫ్లవర్ సీడ్స్) వంటివి శరీరానికి అదనపు బలాన్ని, శక్తిని అందిస్తాయి.

పచ్చి కూరగాయలు – రసాలు: కూరగాయల సలాడ్‌లు, పచ్చి కూరగాయల జ్యూస్‌లు, అలాగే పంచదార, ఐస్ కలపని పండ్ల రసాలు అన్నీ శరీరానికి లాభాలనే చేకూరుస్తాయి. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరచి, శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి తోడ్పడతాయి.

వండిన ఆహారాలు – శక్తిని హరించేవి..

మనం నిత్యం వండుకుని తినే ఆహారాలు, ముఖ్యంగా ఉప్పు, నూనె, మసాలాలు, కృత్రిమ రంగులు, రసాయనాలు కలిపి ప్రాసెస్ చేసిన ఆహారాలు శరీరం నుండి శక్తిని హరిస్తాయని ఆయుర్వదే నిపుణులు చెబుతన్నారు. వీటిని జీర్ణం చేయడానికి, శుభ్రపరచడానికి శరీరం చాలా శక్తిని వినియోగిస్తుంది. దీనివల్ల నిరంతరం అలసట, బలహీనత పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రాసెస్ చేసిన ఆహారాలు శరీరానికి ఇవ్వడంతో పాటు లోపల ఉన్న పోషకాలను కూడా లాగేసుకుంటాయి.

పూర్వకాలంలో నట్స్, పండ్లు, దుంపలు వంటి సహజ ఆహారాలు తినడం వల్లే 150 ఏళ్ల పాటు ఆరోగ్యంగా జీవించారని పేర్కొంటున్నారు. అందుకే.. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు మన ఆహారంలో సహజసిద్ధమైన ఆహారాల శాతాన్ని పెంచుకోవాలని చెబుతున్నారు. ఈ ఆహారపు అలవాట్లలో మార్పు చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చని పేర్కొంటున్నారు. అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే ముందుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రోజూ నీరసంగా ఉంటున్నారా? ఈ సహజ ఆహారాలు మీ డైట్‌లో చేర్చుకోండి
రోజూ నీరసంగా ఉంటున్నారా? ఈ సహజ ఆహారాలు మీ డైట్‌లో చేర్చుకోండి
'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'
'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...