AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: రాసిపెట్టుకోండి.. ఈ ఏడాది చివరికల్లా వీరికి అనూహ్య పురోగతి

కొన్ని రాశుల వారు ఈ ఏడాది ముగిసే లోగా తమ లక్ష్యాలు, ఆశయాలను సాధించుకునే అవకాశం ఉంది. జాతకంలోనూ, గ్రహ చారంలోనూ శని దోషాలు, రాహు దోషాలు, గ్రహాల ప్రతికూలతలు ఎన్ని ఉన్నప్పటికీ వీరు పురోగతి చెందే అవకాశం ఉంది. ఈ రాశులు మేషం, మిథునం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు. ఒక్క రాశినాథుడు తప్ప మరే గ్రహమూ అనుకూలంగా లేనప్పటికీ, వీరు అభివృద్ధి బాటలో దూసుకుపోతారు. మరో రెండు మూడు నెలల్లో వీరు ఆదాయం పెంచుకోవడం, సమస్యల్ని పరిష్కరించుకోవడం, విదేశాలకు వెళ్లడం, ఉద్యోగం సంపాదించడం, జీవనశైలిని మెరుగుపరచుకోవడం వంటివి తప్పకుండా జరుగుతాయి.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 06, 2026 | 5:58 PM

Share
మేషం: గట్టి పట్టుదల, దృఢ సంకల్పం, కార్యదీక్ష, కార్యదక్షత కలిగిన ఈ రాశివారు గురు, శుక్రుల అనుకూలత కారణంగా కొత్త లక్ష్యాలు, ఆశయాలతో ముందుకు సాగే అవకాశం ఉంది. వీరు లక్ష్య సాధనలో వెనుకడుగు వేసే అవకాశం ఉండదు. ఏలిన్నాటి శని దోషం ఉన్నా ఆదాయ వృద్ధికి,  ఉద్యోగంలో పురోగతికి తీవ్రంగా ప్రయత్నించి సఫలీకృతులవుతారు.  రాశ్యధిపతి కుజుడు చతుర్థ, పంచమ స్థానాల్లో సంచారం వల్ల  ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఈ ఏడాది చివరికల్లా అందలాలు ఎక్కుతారు.

1 / 6
మిథునం: దూరదృష్టి, ప్రణాళికాబద్ధమైన వ్యవహారశైలి, సమయస్ఫూర్తి కలిగిన ఈ రాశివారు ప్రతి విషయం లోనూ ఆచితూచి అడుగు వేస్తుంటారు. శని, రాహు, కుజులు అడుగడుగునా సమస్యలు సృష్టించే అవకాశమున్నా వీరు తాము అనుకున్నది సాధించనిదే నిద్రపోరు. రాశ్యధిపతి బుధుడు బుద్ధి కారకుడైనందువల్ల వీరు తమ ప్రతిభనంతా ఉపయోగించి అదనపు ఆదాయాన్ని వృద్ధి చేసుకో వడం, ఆస్తి సమస్యల్ని పరిష్కరించుకోవడం, షేర్లలో లాభాలు గడించడం ఖాయంగా జరుగుతుంది.

2 / 6
సింహం: నాయకత్వ లక్షణాలు, నిర్ణయాత్మకత, సాహసం, చొరవ వంటి లక్షణాలు కలిగిన ఈ రాశివారికి ప్రస్తుతం అష్టమ శని దోషం ఉన్నప్పటికీ తమ కలలను సాకారం చేసుకోవడంలో రాజీపడే అవ కాశం లేదు. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల, సొంత ఇంటి కల, సంపన్నులు కావాలన్న ఆశ నెరవేర్చుకోవడానికి వీరు ఏ అవకాశాన్నీ జారవిడుచుకోరు. రిస్కు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు. ఫలితంగా వీరి ఆశలు, ఆశయాలు, కోరికలు చాలావరకు నెరవేరే అవకాశం ఉంది.

3 / 6
తుల: ఈ రాశివారిలో సహజసిద్ధంగా ఉండే వ్యాపార దక్షత, ప్రణాళికాబద్ధమైన వ్యవహారశైలి, ఉన్నతాశ యాలు తదితర లక్షణాల వల్ల వీరు ఈ ఏడాది ముగిసే లోగా సొంతగా వ్యాపార సంస్థను స్థాపించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారు కొద్ది ప్రయత్నంతో ఉన్నత పదవులను అందుకోవడం జరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల సాకారం అవుతుంది. విదేశాల్లో స్థిరపడే అవకాశం కూడా ఉంది. అనేక రకాల ఆదాయ మార్గాల ద్వారా వీరు సంపదను పెంచుకుంటారు.

4 / 6
వృశ్చికం: పట్టుదలకు, తెగువకు, చొరవకు, నాయకత్వ లక్షణాలకు ప్రతిరూపం అయిన ఈ రాశివారిలో  అగ్ర స్థానంలో ఉండాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది. రాశ్యధిపతి కుజుడిలో కూడా అధికార దాహం, ధన దాహం ఎక్కువగా ఉన్నందువల్ల వీరు గట్టి పట్టుదలతో తమ లక్ష్యాలను సాధించుకుంటారు. ఆస్తి వివాదాల్లో రాజీమార్గం అనుసరించి భూలాభం పొందుతారు. షేర్లు, స్పెక్యులేషన్లు వంటి అద నపు ఆదాయ మార్గాలతో ఆదాయాన్ని పెంచుకుంటారు. ఉన్నత పదవులు అందుకుంటారు.

5 / 6
ధనుస్సు: ఈ రాశివారిలో యాంబిషన్, ఉన్నతాశయాలు, రాజీపడని ధోరణి. అగ్ర స్థానం మీద దృష్టి వంటి లక్షణాలు కాస్తంత ఎక్కువగా ఉంటాయి. రాశ్యధిపతి గురువు ధన కారకుడు, గృహ కారకుడు అయినందువల్ల ఈ రాశివారి దృష్టి సొంత ఇల్లు, ఆదాయ వృద్ది, ఆర్థిక భద్రత, విదేశాల్లో ఉద్యోగం వంటి వాటి మీద కేంద్రీకృతమవుతుంది. అర్ధాష్టమ శని బాధలు ఉన్నప్పటికీ, రాశ్యధిపతి గురువు అనుకూలత వల్ల వీరు త్వరలో తమ లక్ష్యాలు, ఆశలను పూర్తిగా సాధించుకునే అవకాశం ఉంది.

6 / 6
Follow Us