చూడ్డానికి కొత్తిమీరలా కనిపిస్తోంది.. కానీ, ఇది సూఫర్ ఫుడ్..!
Jyothi Gadda
06 october 2026
చూసేందుకు కొత్తిమీర కాడల్లా ఉండే సెలరీ అనేక పోషకాలు కలిగి ఉన్న అద్భుతమైన సూపర్‌ఫుడ్ అని ఆరోగ్య నిపుణులు ఎంతో స్పష్టంగా వెల్లడిస్తున్నారు.
దీనిలో దాదాపు తొంబై ఐదు శాతం వరకు నీటి శాతం ఉండటం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా చాలా అద్భుతంగా కాపాడుతుందని చెప్తున్నారు.
అతి తక్కువ కేలరీలు మరియు ఎక్కువ పీచు పదార్థం కలిగి ఉండటం వలన బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ఆహారంగా పనిచేస్తుంది.
సెలరీలోని సహజమైన ఫైబర్ జీర్ణక్రియను వేగవంతం చేసి మలబద్ధకం సమస్యను దూరం చేస్తూ పేగుల్లో మంచి బ్యాక్టీరియాను వేగంగా వృద్ధి చేస్తుంది.
ఇందులోని పొటాషియం, థాలైడ్స్ రక్తనాళాలను శుభ్రపరిచి బిపీని క్రమబద్ధీకరిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి.
విటమిన్ ఎ, సి, కే లతో పాటు అపిజెనిన్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉన్న ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో చురుగ్గా పనిచేస్తాయి.
కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్ వంటి తీవ్రమైన సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఇది మేలైన సహజసిద్ధమైన ఉపశమనాన్ని ఇస్తూ వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
దీనిలోని విటమిన్ కే ఎముకలను దృఢంగా మార్చుతుంది కాబట్టి సెలరీ కాడలను సలాడ్లు, జ్యూస్‌లు లేదా సూప్‌ల రూపంలో రోజూ తీసుకోవచ్చు.
అయితే బిపీ, రక్తం పలచబడే మందులు వాడేవారు, అలర్జీ సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా వైద్యుల సలహాతోనే దీనిని తీసుకోవడం మంచిది.
మరిన్ని వెబ్ స్టోరీస్
రోజూ ఒక కప్పు ఉడికించిన సోయాబీన్స్ తిన్నారంటే..ఈ సమస్యలన్నీ పరార్!
ఈ దిశలో మందార మొక్కను నాటితే ఐశ్వర్యం మీ వెంటే!
వర్షాకాలంలో రాగులు వాడుతున్నారా..? ఇది తెలుసుకోండి..!