AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతో తెలుసా?

Arasavalli Surya Temple News: శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారికి హైదరాబాద్‌కు చెందిన అజ్ఞాత భక్తుడు సుమారు రూ.2 కోట్ల విలువైన ఆభరణాలను సమర్పించారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని ఈ ఆభరణాలతో అలంకరించారు. భక్తుడు సమర్పించిన అపురూప కానుకలు ఆలయ వైభవాన్ని మరింత ఇనుమడింపజేశాయి.

అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతో తెలుసా?
Arasavalli Surya Temple
Rajashekher G
|

Updated on: Oct 07, 2026 | 7:38 AM

Share

Arasavalli Surya Temple News: శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని ప్రసిద్ధ శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో భక్తి వైభవం వెల్లివిరిసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు స్వామివారికి సుమారు రూ.2 కోట్ల విలువైన ఆభరణాలను సమర్పించి తన భక్తిని చాటుకున్నారు. స్వామివారి అలంకరణ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ ఆభరణాలు ఆలయానికి చేరుకోవడంతో భక్తుల్లో ఆసక్తి నెలకొంది.

భక్తుడు సమర్పించిన ఆభరణాల్లో రాగితో తయారు చేసిన మకర తోరణంతో పాటు వెండి కిరీటం, కవచం, కేయూరాలు, వాణీ చెంగులు, స్వామివారి పాదాలు, సనక-సనందన కవచాలు, మాథర, పింగళ కవచాలు, అశ్వపీఠం తదితరాలు ఉన్నాయి. వీటికి బంగారు తాపడం చేయించి అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.

అంతేకాకుండా స్వామివారి పరివార దేవతలైన ఉషా, ఛాయా, పద్మినీ అమ్మవార్ల ఉత్సవమూర్తుల కోసం కూడా ప్రత్యేకంగా కవచాలు, హస్తాలు తదితర ఆభరణాలను తయారు చేయించి సమర్పించారు. భక్తుడు సమర్పించిన ఈ ఆభరణాలు సూర్యనారాయణ స్వామివారి అలంకరణకు మరింత శోభను తీసుకొచ్చాయి.

ఇవి కూడా చదవండి

మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఈ నూతన ఆభరణాలతో అలంకరించారు. స్వామివారి దివ్య అలంకరణను దర్శించిన భక్తులు ఆధ్యాత్మికానందానికి లోనయ్యారు. సూర్యభగవానుడి కృపతో ఆరోగ్యం, ఆయురారోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం.

తమ పేరు, వివరాలను వెల్లడించకుండా ఓ భక్తుడు ఇంతటి విలువైన ఆభరణాలను స్వామివారికి సమర్పించడం భక్తి భావానికి నిదర్శనంగా నిలిచింది. దేవుడికి సమర్పించే కానుకలో విలువ కంటే భక్తి, విశ్వాసమే ముఖ్యమని భావించే సంప్రదాయానికి ఈ ఘటన మరో ఉదాహరణగా నిలిచింది.

Follow Us
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..