AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shreyas Iyer: 42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్

Shreyas Iyer: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో శ్రేయస్ అయ్యర్ 42 బంతుల్లోనే తొలి టీ20 సెంచరీ బాదాడు. టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలో సెంచరీ సాధించిన 7వ భారత ఆటగాడిగా నిలిచాడు. రోహిత్, విరాట్, గిల్ లాంటి ప్లేయర్ల రికార్డు క్లబ్‌లో శ్రేయస్ చేరాడు.

Shreyas Iyer: 42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
Shreyas Iyer
Rakesh
|

Updated on: Oct 07, 2026 | 7:07 AM

Share

Shreyas Iyer: భారత క్రికెట్ అభిమానులకు శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన వినోదాన్ని పంచాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 పోరులో కళ్ళు చెదిరే ప్రదర్శనతో హోరెత్తించాడు. సునాయాసంగా సిక్సర్లు భాది, విధ్వంసకర సెంచరీతో భారత్‌ను ఒంటి చేత్తో గెలిపించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన అత్యంత అరుదైన భారత దిగ్గజాల జాబితాలో శ్రేయస్ అయ్యర్ పేరు ముద్రించుకున్నాడు.

కేవలం 42 బంతుల్లోనే శతకం

వెస్టిండీస్ విధించిన 172 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రేయస్ అయ్యర్ పూనకం వచ్చినట్లు ఆడాడు. కేవలం 42 బంతుల్లోనే తన తొలి టీ20 అంతర్జాతీయ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తం 43 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 237.21 స్ట్రైక్ రేట్‌తో 102 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. ఇషాన్ కిషన్ చక్కటి సహకారం అందించడంతో టీమిండియా 15వ ఓవర్‌లోనే లక్ష్యాన్ని ఊదేసింది.

మూడు ఫార్మాట్లలో సెంచరీల ప్రయాణం ఇదే

శ్రేయస్ అయ్యర్ అంతర్జాతీయ వన్డేల్లో తొలి సెంచరీని 2020 ఫిబ్రవరి 5న న్యూజిలాండ్‌పై హ్యామిల్టన్‌లో సాధించాడు. ఆ తర్వాత టెస్టుల్లో అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే (2021 నవంబర్ 25) సెంచరీ బాదాడు. ఇప్పుడు టీ20ల్లో కూడా సెంచరీ బాది, మూడు ఫార్మాట్లలో సెంచరీల మైలురాయిని చేరుకున్న సువర్ణ అధ్యాయాన్ని పూర్తి చేశాడు.

శ్రేయస్ కంటే ముందు ఈ ఘనత సాధించింది వీళ్లే

భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన మొదటి బ్యాటర్‌గా సురేష్ రైనా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఈ ఘనత సాధించారు. తాజాగా శ్రేయస్ అయ్యర్ ఈ క్లబ్‌లో ఏడో భారతీయ బ్యాటర్‌గా చేరాడు.

1. సురేష్ రైనా

2. రోహిత్ శర్మ

3. కేఎల్ రాహుల్

4. విరాట్ కోహ్లీ

5. శుభ్‌మన్ గిల్

6. యశస్వి జైస్వాల్

7. శ్రేయస్ అయ్యర్

ప్రత్యర్థులకు గట్టి హెచ్చరిక

టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తూనే ముందుండి నడిపించిన శ్రేయస్ అయ్యర్, తన బ్యాటింగ్ సత్తాతో విమర్శకుల నోళ్లు మూయించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చి స్కోరు బోర్డును పరుగులు పెట్టించడమే కాకుండా, సిరీస్‌లోని తదుపరి మ్యాచ్‌లకు విండీస్‌ జట్టుకు స్పష్టమైన హెచ్చరికలు పంపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు