AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెలబ్రిటీలను తప్పుబట్టారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ

సెలబ్రిటీలను తప్పుబట్టారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ

Samatha J
|

Updated on: Oct 06, 2026 | 1:50 PM

Share

డీప్‌ఫేక్ వీడియోల వివాదంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెలబ్రిటీలనే తప్పుబట్టారు. అభ్యంతరకరమైన లింకులను ప్రచారం చేయడం ద్వారా వారే వాటిని విస్తృతం చేశారని ఆయన ఆరోపించారు. డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించిన వారిని పట్టుకొని, ఆ విషయాన్ని అందరికీ తెలిసేలా చేయడం ద్వారా నేరస్థులలో భయం కలిగించాలని సూచించారు. అభ్యంతరకర కంటెంట్ ప్రచారం కూడా నేరమేనని గుర్తు చేశారు.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి డీప్‌ఫేక్ వీడియోల వివాదంపై తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీ తాజాగా కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత డీప్‌ఫేక్ వీడియోలు, సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకున్న మార్ఫింగ్ కంటెంట్ పై జరుగుతున్న చర్చలో పాల్గొన్నారు. ఈ వ్యవహారంలో ఆయన సెలబ్రిటీలనే తప్పుబట్టడం గమనార్హం.అభ్యంతరకరమైన డీప్‌ఫేక్ వీడియోల లింకులను సెలబ్రిటీలు స్వయంగా ప్రచారం చేయడం వల్లే అవి ఎక్కువ మందికి చేరాయని, అందరూ చూసేలా చేశారని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. వీడియోలు సృష్టించిన వారిని గుర్తించి, వారిని పట్టుకోవడం ఎంత ముఖ్యమో, ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి నేరస్థుల్లో భయం కలిగించడం కూడా అంతే అవసరం అని ఆయన సూచించారు.డీప్‌ఫేక్ వీడియోలను తయారుచేసిన వ్యక్తిని పట్టుకున్న విషయాన్ని బహిర్గతం చేయడం ద్వారా ఇటువంటి చర్యలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరిక ఇచ్చినట్లు అవుతుందని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, అభ్యంతరకరమైన కంటెంట్‌ను ప్రచారం చేయడం కూడా చట్టరీత్యా నేరమే అనే విషయాన్ని మనమంతా గుర్తుంచుకోవాలని ఆయన నొక్కి చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి.

మరిన్ని వీడియోల కోసం :

ఒకే నెలలో రెండు సినిమాలతో సందడి చేస్తున్న సాయి పల్లవి

కన్‌ఫ్యూజన్‌లో కన్నడ హీరోలు..ఎందుకంటే?

బాలీవుడ్‌లో సినిమా తీయటం అంత ఈజీ కాదన్న అజయ్‌ దేవగన్‌

ఆకతాయిలకు జూనియర్ వార్నింగ్‌… ఎవ్వరినీ వదిలిపెట్టనన్న ఎన్టీఆర్‌..

రణబాలి కథ రివీల్ చేసిన దర్శకుడు!

Follow Us