AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inidan Railways: దసరా, దీపావళికి ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ.. వెంటనే అలర్ట్ అవ్వండి..

దసరా, దీపావళికి ఇంటికెళ్లేవారికి రైల్వేశాఖ గుడ్ న్యూస్ తెలిపింది. ప్రత్యేక రైళ్లను భారీ సంఖ్యలో ప్రకటించింది. ఈ రైళ్లల్లో ఖాళీగా ఉన్న బెర్త్‌ల వివరాలను కూడా దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసింది. వీటిల్లో ఇప్పటినుంచే టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది.

Inidan Railways: దసరా, దీపావళికి ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ.. వెంటనే అలర్ట్ అవ్వండి..
Indian Railway
Venkatrao Lella
|

Updated on: Oct 07, 2026 | 7:57 AM

Share

దసరా, దీపావళికి ఇంటికెళ్లాలనుకుంటున్నారా..? ట్రైన్లలో సీటు దొరకదని టెన్షన్ పడనక్కర్లేదు. వరుస పండుగల కారణంగా రైల్వేశాఖ వందల సంఖ్యలో స్పెషల్ ట్రైన్లను రద్దీ మార్గాల్లో ప్రవేశపెడుతోంది. ఈ రైళ్లల్లో టికెట్ల అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ కూడా మొదలుపెట్టింది. పండక్కి కొద్దిరోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇంటికెళ్లేవారు టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. టికెట్లు దొరకవనే ఆందోళనలతో ముందే సీటు రిజర్వ్ చేసి పెట్టుకుంటున్నారు. అయితే పండుగ ప్రత్యేక రైళ్లల్లో బెర్తుల ఖాళీ వివరాలను దక్షిణ మధ్య రైల్వేశాఖ ప్రకటించింది. ఈ మేరకు ఒక లిస్ట్ విడుదల చేయగా.. ఇందులో చాలా రైళ్లల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్ 6 నాటికి ఖాళీగా ఉన్న బెర్త్‌ల సంఖ్యను రైల్వేశాఖ విడుదల చేసింది. వివిధ క్లాసుల్లో ఈ సీట్లు ఉన్నట్లు స్పష్టం చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం బెర్త్‌ల ఖాళీల సంఖ్యను ప్రకటించినట్లు పేర్కొంది.

తెలంగాణ, ఏపీ మీదుగా ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్-శ్రీకాకుళం(07425) రైలులో అక్టోబర్ 11న ప్రయాణానికి 67 బెర్త్‌లు, అక్టోబర్ 18కు 228, అక్టోబర్ 25న 611, నవంబర్ 1కు 635, నవంబర్ 8కు 664, నవంబర్ 15కు 656, నవంబర్ 22కు 655, నవంబర్ 29కు 654 బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి. ఇక చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్(07037) స్పెషల్ ట్రైన్లో అక్టోబర్ 6కు 386, అక్టోబర్ 20కు 223, అక్టోబర్ 27న 634, నవంబర్ 3కు 714, నవంబర్ 10న 732, నవంబర్ 17కు 730, నవంబర్ 24న 733 సీట్లు ఖాళీగా ఉన్నాయి. చర్లపల్లి-బెంగళూరు(07065) రైలులో అక్టోబర్ 12న 571, అక్టోబర్ 19న 745, అక్టోబర్ 26కు 729, నవంబర్ 2న 762, నవంబర్ 9కు 765, నవంబర్ 26న765 సీట్లు ఖాళీగా ఉన్నాయి.

ముందే బుక్ చేస్కోండి..

సికింద్రాబాద్-కాకినాడ(07039) రైలు ప్రతీ బుధవారం నడవనుండగా.. దీనికి సంబంధించి అక్టోబర్ 14న 241, అక్టోబర్ 21కు 515, అక్టోబర్ 28కు 746, నవంబర్ 4న 770, నవంబర్ 11కు 777, నవంబర్ 18న 777 బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి. చర్లపల్లి-తిరువణ్ణైమలై(07003) స్పెషల్ రైల్లో అక్టోబర్ 13న 257, అక్టోబర్ 20న 656, అక్టోబర్ 27న 701, నవంబర్ 3కు 737, నవంబర్ 10కు 704, నవంబర్ 17కు 742 బెర్త్‌లు ఖాళీగా ఉన్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఇక చెన్నై వైపు ప్రతీ శుక్రవారం వెళ్లే చర్లపల్లి-సెంగొట్టాయ్‌(07191), ప్రతీ సోమవారం ప్రయాణించే చర్లపల్లి – హజ్రత్‌ నిజాముద్దీన్‌ (07021), ప్రతి మంగళవారం అందుబాటులో ఉండే (07023) చర్లపల్లి – హజ్రత్‌ నిజాముద్దీన్‌ రైళ్లలో భారీగా ఖాళీలు ఉన్నాయి. దసరా, దీపావళి పండుగలకు ఇంటికెళ్లేవారు దీనిని గమనించి సీట్లను బుక్ చేసుకోవాలని కోరింది. చాలమంది సీట్లు దొరకవనే అపోహంతో ప్రైవేట్ బస్సులను ఆశ్రయించి వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు. కానీ రైళ్లల్లో తక్కువ ధరలో ప్రయాణం చేయవచ్చు.

Follow Us
రోజూ నీరసంగా ఉంటున్నారా? ఈ సహజ ఆహారాలు మీ డైట్‌లో చేర్చుకోండి
రోజూ నీరసంగా ఉంటున్నారా? ఈ సహజ ఆహారాలు మీ డైట్‌లో చేర్చుకోండి
'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'
'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...