AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: ఇద్దరి మహిళల ఆలోచన.. వరిగడ్డితో కోట్లు సంపాదన.. ఐడియా మామూలుగా లేదుగా!

దేశంలో అత్యధిక వరి పండించే రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఒకటి. అయితే పంట కోత తర్వాత గడ్డిని కొంతమంది రైతులు పశువుల కోసం వాడుకుంటే మరికొంతమంది రైతులు పొలంలోనే తగలబెడుతుంటారు. కానీ ఏం పనికిరాదనుకునే ఈ గడ్డితోనే కోట్లు సంపాదించవచ్చంటే మీరు నమ్ముతారా? కచ్చితంగా నమ్మాల్సిందే! అవును.. వ్యవసాయ వ్యర్థాలతో ఏడాదికి రూ.7-8 కోట్ల టర్నోవర్ సాధిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇద్దరు మహిళలు. వారెవరో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Business Idea: ఇద్దరి మహిళల ఆలోచన.. వరిగడ్డితో కోట్లు సంపాదన.. ఐడియా మామూలుగా లేదుగా!
Haryana Women Turn Farm Waste Into Rs 8 Cr Green Business
Anand T
|

Updated on: Nov 20, 2026 | 3:51 PM

Share

వరి కోత తర్వాత పొలంలో మిగిలిపోయిన గడ్డిని కొందరు పశువుల ఆహారంగా వాడుకుంటే.. మరికొందరు మాత్రం మిగిలిపోయే గడ్డిని వ్యర్థంగా భావించి పొలంలోనే తగలబెడుతుంటారు. దీనివల్ల వాయు కాలుష్యం తీవ్రంగా పెరుగుతోంది. అయితే ఈ సమస్యకు ఎలాగైనా చెక్ పెట్టాలని నిర్ణయించుకున్న హర్యానాకు చెందిన సంజన, రాజస్థాన్‌కు చెందిన సోనికా అనే ఇద్దరు మహిళలు.. దాన్నే వ్యాపారంగా మలుచుకోవాలని ఆలోచించారు. ఆ వ్యవసాయ వ్యర్థాలతోనే బయోఫ్యూయల్ తయారు చేస్తూ ప్రస్తుతం ఏడాదికి రూ.7-8 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నారు. అంతేకాదు తమ వ్యాపారంతో పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా స్థానిక ప్రజలకు ఉపాధి కూడా కల్పిస్తున్నారు.

2024లో ప్రారంభమైన వ్యాపారం

హర్యానాలోని సిర్సా జిల్లా ఘోరన్వాలి గ్రామానికి చెందిన సంజన, రాజస్థాన్‌లోని భద్రా ప్రాంతానికి చెందిన సోనికా ఇద్దరూ స్నేహితులు. వీరి చదువులు పూర్తయిన తర్వాత సొంత గ్రామాలకు వచ్చిన వీరిద్దరూ.. వరి కోతల తర్వాత రైతులు గడ్డిని వేస్ట్‌గా తగలబెట్టడం ద్వారా ఏర్పడే గాలి కాలుష్యాన్ని గమనించారు. ఈ సమస్యకు చెక్ పెట్టడంతో పాటు దాన్ని వ్యాపారంగా మార్చుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి బయోఫ్యూయల్ తయారు చేయాలని 2024లో SSAR Biomass Green Pvt. Ltd. కంపెనీని స్టార్ట్ చేశారు.

రూ.2.5 కోట్ల పెట్టుబడితో తయారీ కేంద్రం

హర్యానాలోని ఘోరన్వాలి గ్రామంలో తమ కంపెనీని స్టార్ట్ చేయాలని సంజన, సోనికా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇందుకోసం సుమారు రూ.2.5 కోట్ల పెట్టుబడి అవసరమని.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (AIF) పథకం ద్వారా ఈ పెట్టుబడిని సమకూర్చుకున్నారు. తర్వాత గడ్డిని బయో ఇంధనంగా మార్చేందుకు అవసరమైన ప్రత్యేక యంత్రాలను కొనుగోలు చేశారు.

వరి గడ్డితో బయోఫ్యూయల్ తయారీ

అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత స్థానిక రైతుల నుంచి వరి కోత తర్వాత పొలాల్లో మిగిలిపోయిన గడ్డిని సేకరించడం స్టార్ట్ చేశారు. బేలర్ యంత్రాల ద్వారా పొలంలోనే గడ్డిని కట్టలుగా మార్చి కంపెనీకి తరలించేవారు. అక్కడ ప్రత్యేక యంత్రాల ద్వారా ఆ గడ్డిని ప్రాసెస్ చేసి గట్టి బయోఫ్యూయల్ గుళికలుగా తయారు చేస్తారు. వీటిని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సరఫరా చేస్తారు. అక్కడ సంప్రదాయ ఇంధనాలకు బదులుగా వీటిని ఉపయోగించి కరెంటు ఉత్పత్తి చేస్తారు. ఇప్పుడు వీరి కంపెనీ ఏడాదికి సుమారు లక్ష నుంచి 1.5 లక్షల క్వింటాళ్ల వరకు వరి వ్యర్థాలను ప్రాసెస్ చేసి బయోఫ్యూయల్‌ను తయారు చేస్తోంది.

20 మందికి పైగా ఉపాధి

వీరికి వచ్చిన ఈ ఐడియా కేవలం ఆదాయ వనరుగా మాత్రమే కాకుండా పర్యావరణానికి మేలు చేయడంతో పాటు స్థానిక ప్రజలకు ఉపాధి కూడా కల్పించింది. ప్రస్తుతం వీళ్ల కంపెనీలో స్థానిక గ్రామాలకు చెందిన 20 మంది ఉపాధి పొందుతున్నారు. మరోవైపు సిర్సా, పరిసర ప్రాంతాల్లోని బేలర్ ఆపరేటర్లు, రవాణా రంగానికి చెందిన వారికి కూడా ఈ వ్యాపారం ద్వారా ఆదాయం లభిస్తోంది. వ్యర్థంగా భావించే పంట గడ్డితోనూ కోట్ల రూపాయల వ్యాపారం చేయవచ్చని నిరూపించిన ఈ ఇద్దరు మహిళల ప్రయాణం ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us