AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం మ్యాచ్‌ రా మావా.. 0, 0, 1, 0, 6, 6, 0, 2, 4, 0, 2.. సింగిల్ డిజిట్ దాటని ప్లేయర్లు.. జట్టు స్కోర్ ఎంతంటే?

India A vs Nepal: నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు 306 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత కెప్టెన్ తిలక్ వర్మ, కుమార్ కుశాగ్ర అద్భుత సెంచరీలతో జట్టుకు భారీ స్కోరు అందించగా, అనంతరం ప్రిన్స్ యాదవ్, హర్షిత్ రాణా నిప్పులు చెరిగే బౌలింగ్‌తో నేపాల్‌ను కేవలం 26 పరుగులకే ఆలౌట్ చేశారు.

ఏం మ్యాచ్‌ రా మావా.. 0, 0, 1, 0, 6, 6, 0, 2, 4, 0, 2.. సింగిల్ డిజిట్ దాటని ప్లేయర్లు.. జట్టు స్కోర్ ఎంతంటే?
India A Vs Nepal Score
Venkata Chari
|

Updated on: Nov 20, 2026 | 9:38 PM

Share

India A vs Nepal: భారత్ ఏ జట్టు బౌలర్లు నిప్పులు చెరిగారు. నేపాల్ బ్యాటర్లకు కనీసం పోటీ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా చిత్తు చేశారు. కేవలం 11.3 ఓవర్లలోనే నేపాల్ ఇన్నింగ్స్‌కు తెరదించారు. దీంతో భారత్ ఏ జట్టు ఏకంగా 306 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నేపాల్ బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. కేవలం 26 పరుగులకే నేపాల్ జట్టు ఆలౌట్ అయింది. ఇన్నింగ్స్‌లో ఇంకా 38 ఓవర్లకు పైగా మిగిలి ఉండగానే నేపాల్ ఆట ముగిసింది. లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలో ఇది ఐదో అత్యల్ప స్కోరుగా నమోదైంది. నేపాల్ బ్యాటర్లు స్కోర్లు 0, 0, 1, 0, 6, 6, 0, 2, 4, 0, 2 చూస్తే కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే.

ఈ ఘోర పరాజయంలో భారత పేసర్లు హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్ కీలక పాత్ర పోషించారు. కొత్త బంతితో ఇద్దరూ అద్భుతమైన వేగంతో బౌలింగ్ చేస్తూ బంతిని పదునుగా స్వింగ్ చేయించారు. వారి ధాటికి నేపాల్ బ్యాటర్లు క్రీజులో నిలబడలేకపోయారు.

ముఖ్యంగా తొలి పవర్‌ప్లేలోనే నేపాల్ తొమ్మిది వికెట్లు కోల్పోవడం ఆ జట్టు బ్యాటింగ్ వైఫల్యానికి అద్దం పడుతోంది. హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్ నిప్పులు చెరిగే బంతులతో నేపాల్ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చారు.

మొత్తంగా భారత ఏ జట్టు బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 306 పరుగుల భారీ విజయంతో ప్రత్యర్థి జట్టుకు గట్టి షాక్ ఇచ్చింది.

Follow Us