AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: కొనసాగుతున్న రుతువపనాల నిష్క్రమణ.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

AP, Telangana Weather Update Today: ఎల్‌నీనో ఎఫెక్ట్‌తో శీతాకాలంలోనూ వేసవి తలపించే ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించే వార్త చెప్పింది భారత వాతావరణ కేంద్రం. బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తన ప్రభావం, రుతుపవణాల నిష్క్రమణ కొనసాగుతున్న నేపథ్యంలో తెలుగురాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు మోస్తరు నుంచి తేలికపాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతవారణ శాఖ అంచనా వేసింది. మరికొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం, ఉక్కపోత ఉంటుందని తెలిపింది. కాబట్టి నేడు ఏపీ, తెలంగాణలోని ఏ జిల్లాల్లో వాతవరణం ఎలా ఉండబోతుందో చూద్దాం.

Weather Report: కొనసాగుతున్న రుతువపనాల నిష్క్రమణ.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
Ap, Telangana Weather Update Today
Anand T
|

Updated on: Oct 07, 2026 | 7:05 AM

Share

తెలుగురాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. శీతాకాలంలో కూడా వేసవి తలపించే ఉక్కపోత నుంచి తెలుగురాష్ట్రాల ప్రజలకు ఉపశమనం కల్సిస్తూ.. నేడు ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాకాతంలోని ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ఉపసంహరణ కొనసాగుతున్న ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం, మరికొన్ని ప్రాంతాల్లో ఉక్కపోతలు కూడా ఉంటాయని స్పష్టం చేసింది.

హైదరాబాద్‌లో వాతావరణం ఇలా

ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో ఉదయం పూట ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం, చల్లటి గాలులు వీస్తాయని.. మధ్యాహ్నం మాత్రం నిన్నటితో పోల్చుకుంటే ఒకటి రెండు రేట్లు ఎక్కవగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచానా వేసింది. దీంతో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నగరవాసుల ఉక్కపోతను ఎదుర్కోవసి రావచ్చు.. ఇక సాయంత్రం మళ్లీ వాతావరణం మారుతుంది. సాయంత్రం సమయంలో నగరంలో చాలా ప్రాంతాల్లో తేలిపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో వాతావరణం ఇలా

ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు జిల్లాల్లో కూడా ఇదే తరహా వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని జిల్లాల్లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, రంగారెడ్డిలో మాత్రం నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. వర్షాల సమయంటో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీస్తాయని అంచనా వేసింది.

ఆంధ్రప్రదేశ్‌ వాతవారణం

బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా తీరప్రాంత జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళంలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని అంచానా వేసింది. అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు