AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతోంది?

షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతోంది?

Samatha J
|

Updated on: Nov 19, 2026 | 11:53 AM

Share

పండుగ సీజన్ ముగియడంతో టాలీవుడ్ స్టార్లు తమ సినిమాల షూటింగ్స్‌లో బిజీగా మారారు. చిరంజీవి కాకా హైదరాబాద్‌లోని నేటివ్ స్టూడియోలో చిత్రీకరణ జరుపుకుంటుండగా, బాలకృష్ణ దాదా కాకినాడలో కొనసాగుతోంది. ప్రభాస్ ఫౌజీ కోకాపేటలో, మహేష్ బాబు-రాజమౌళిల వారణాసి గండిపేటలో చిత్రీకరణ జరుగుతున్నాయి. పలువురు అగ్ర తారలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తమ ప్రాజెక్టులతో నిమగ్నమై ఉన్నారు.

మపండుగ సీజన్ ముగియడంతో టాలీవుడ్ స్టార్లు తమ షూటింగ్ షెడ్యూల్స్‌పై పూర్తి దృష్టి సారించారు. గతంలో వాయిదా పడిన చిత్రీకరణలను త్వరగా పూర్తి చేసేందుకు నటీనటులు, సాంకేతిక బృందాలు వేగంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులు వివిధ లొకేషన్లలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కాకా చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని నేటివ్ స్టూడియోలో జరుగుతోంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ అందించిన అధీరతో పాటు తమిళ హీరో సూరి చిత్రం చిత్రీకరణ ముచ్చింతల్‌లో కొనసాగుతోంది. సందీప్ కిషన్ కొత్త సినిమా, అర్జున్ నటిస్తున్న పొలిమేర 3 వర్క్ కూడా అక్కడే జరుగుతున్నాయి. శర్వానంద్, శ్రీను వైట్ల, జార్జ్ క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ శంకర్ పల్లిలో జరుగుతోంది.నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దాదా వర్క్ కాకినాడలో జరుగుతుండగా, ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఫౌజీ చిత్రం షూటింగ్ కోకాపేటలో కొనసాగుతోంది. అల్లు అర్జున్ నటిస్తున్న రాకా చిత్రం షూటింగ్ గత కొన్ని నెలలుగా ముంబైలోనే జరుగుతోంది. ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న జై హనుమాన్ తో పాటు ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నాయి.

 

Follow Us