స్టార్ హీరో అవ్వాల్సినవాడు విలన్ అయ్యాడు.. అతని గర్ల్ ఫ్రెండ్ కూడా తెలుగులో క్రేజీ హీరోయినే
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో చాలామంది విలన్స్ సైతం విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటున్నారు. హీరో కటౌట్ ఉన్నప్పటికీ విలన్ పాత్రలు పోషించేందుకు రెడీ అంటున్నారు. ఎందుకంటే అటు హీరోలకు రానీ ఇమేజ్ సైతం విలన్ పాత్రలకు రావడం విశేషం. అలాగే ఒకప్పుడు హీరోలుగా మెప్పించినవారే.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో పవర్ ఫుల్ విలన్ పాత్రలతో సాలిడ్ కంబ్యాక్ ఇస్తున్నారు.

సినిమా ఇండస్ట్రీలో హీరోగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత విలన్‌గా సరికొత్త గుర్తింపు తెచ్చుకుంటున్న నటులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో విలన్ పాత్రలకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. ఒకప్పుడు హీరోలుగా అలరించిన నటులు సైతం ఇప్పుడు ప్రతినాయకులుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సైఫ్ అలీఖాన్, బాబీ డియోల్, ఇమ్రాన్ హష్మీ వంటి నటులు ఈ ట్రెండ్‌లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే బాటలో తెలుగులోనూ ఓ నటుడు తన సెకండ్ ఇన్నింగ్స్‌తో అదరగొడుతున్నాడు. తెలుగులో చాలా మంది హీరోలు విలన్స్ గా మారారు జగపతి బాబు, శ్రీకాంత్, ఆది పినిశెట్టి లాంటి వారు విలన్స్ గా అదరగొట్టారు. వీరిలో మరో హీరో కూడా విలన్ గా మారాడు అతనే వినయ్ రాయ్. వినయ్ రాయ్ పేరు వినగానే చాలామందికి వెంటనే గుర్తుకు రాకపోవచ్చు. కానీ ఆయన నటించిన సినిమాలు చూస్తే మాత్రం ఈజీగా గుర్తుపట్టేస్తారు. 2007లో విడుదలైన ‘ఉన్నాలే ఉన్నాలే’ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలో హీరోగా పరిచయమయ్యాడు. తెలుగులో ఈ సినిమా ‘నీవల్లే నీవల్లే’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకోవడంతో వినయ్‌కు యూత్‌లో మంచి గుర్తింపు వచ్చింది.
ఆ తర్వాత ‘జయం కొండాన్’, ‘వాన’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అయితే వరుస సినిమాలు చేసినప్పటికీ స్టార్ హీరోగా మాత్రం ఎదగలేకపోయాడు. దీంతో తన కెరీర్‌లో కొత్త ప్రయోగాలకు సిద్ధమయ్యాడు. హీరోగా కొనసాగుతూనే విభిన్నమైన పాత్రలపై ఆసక్తి చూపించిన వినయ్ రాయ్.. క్రమంగా విలన్ పాత్రల వైపు అడుగులు వేశాడు. తమిళంలో ‘డాక్టర్’ సినిమాతో ప్రతినాయకుడిగా తనలోని మరో కోణాన్ని పరిచయం చేశాడు. ఈ సినిమాలో ఆయన నటనకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ‘ఎతర్కుం తునిందవన్’, ‘కస్టడీ’ వంటి సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించాడు. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హనుమాన్’ సినిమాలో మైఖేల్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ తనదైన స్టైల్‌తో ఆకట్టుకోగలనని నిరూపించాడు. ప్రస్తుతం విలన్‌గా వినయ్ రాయ్‌కు మంచి అవకాశాలు వస్తున్నాయి.
ఇక వినయ్ రాయ్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆయన ప్రేమలో ఉన్న విషయం చాలామందికి తెలిసిందే. టాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విమలా రామన్‌తో ఆయన ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ తమ అనుబంధాన్ని అభిమానులతో పంచుకుంటుంటారు. విమలా రామన్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘ఎవరైనా ఎప్పుడైనా’, ‘గాయం 2’, ‘రంగ ది దొంగ’, ‘చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి’ వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్‌గా మాత్రమే కాకుండా గ్లామర్ పాత్రలు, ప్రత్యేక పాటల్లోనూ కనిపించింది. ‘నువ్వా నేనా’ సినిమాలో ఆమె చేసిన గ్లామర్ సాంగ్ అప్పట్లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న విమలా రామన్.. ఇప్పుడు మళ్లీ తన కెరీర్‌పై దృష్టి పెట్టింది. ‘రుద్రంగి’, ‘గాండీవధారి అర్జున’ వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించింది. ఇలా ఒకప్పుడు హీరోయిన్‌గా అలరించిన విమలా రామన్, మరోవైపు హీరోగా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు విలన్‌గా రాణిస్తున్న వినయ్ రాయ్.. ఇద్దరూ తమ తమ కెరీర్‌లలో ముందుకు సాగుతున్నారు. వీరిద్దరి జంటకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
