AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Sooryavanshi: 100మందిలో ఒకడిగా చోటు.. వైభవ్ సూర్యవంశీకి అరుదైన గుర్తింపు

Vaibhav Sooryavanshi: టైమ్ మ్యాగజైన్ తొలిసారిగా విడుదల చేసిన TIME100 Next India జాబితాలో వైభవ్ సూర్యవంశీ, శుభాంశు శుక్లా, ఆర్యన్ ఖాన్, ఆలియా భట్ సహా 100 మంది భారతీయులకు చోటు దక్కింది. క్రీడలు, సినిమా, సైన్స్, వ్యాపారం, సంగీతం వంటి రంగాల నుంచి ప్రముఖులను ఎంపిక చేశారు.

Vaibhav Sooryavanshi: 100మందిలో ఒకడిగా చోటు.. వైభవ్ సూర్యవంశీకి అరుదైన గుర్తింపు
Vaibhav Sooryavanshi
Rakesh
|

Updated on: Nov 19, 2026 | 12:36 PM

Share

Vaibhav Sooryavanshi: ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్‌ విడుదల చేసిన తొలి టైమ్100 నెక్ట్స్ ఇండియా జాబితాలో భారత్‌కు చెందిన 100 మంది ప్రతిభావంతులకు చోటు దక్కింది. క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ నుంచి అంతరిక్ష యాత్ర చేసిన శుభాంశు శుక్లా వరకు.. సినిమా, క్రీడలు, సైన్స్, వ్యాపారం, సామాజిక మార్పు వంటి రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నవారిని ఈ జాబితాలో గుర్తించారు. బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు-దర్శకుడు ఆర్యన్ ఖాన్ కూడా ఇందులో ఉన్నారు.

తొలిసారి భారత్ కోసం ప్రత్యేక జాబితా

టైమ్ మ్యాగజైన్ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎదుగుతున్న నాయకులు, ప్రతిభావంతులను గుర్తిస్తూ టైమ్ 100 నెక్ట్స్ జాబితాను విడుదల చేస్తోంది. ఇప్పుడు తొలిసారిగా భారత్ కోసం ప్రత్యేక జాబితాను తీసుకొచ్చింది. ఇది టైమ్ 100 నెక్ట్స్ కార్యక్రమానికి తొలి అంతర్జాతీయ విస్తరణ. టైమ్ జర్నలిస్టులు భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను పరిశీలించి ఈ 100 మందిని ఎంపిక చేశారు. రిలయన్స్ ఈ కార్యక్రమానికి ప్రధాన భాగస్వామిగా వ్యవహరిస్తోంది. దేశ భవిష్యత్తును ప్రభావితం చేయగల కొత్త తరం నాయకులు, కళాకారులు, క్రీడాకారులు, శాస్త్రవేత్తలను ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ జాబితా లక్ష్యం.

వైభవ్ గురించి రాసిన ఆయుష్మాన్ ఖురానా

ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వారి గురించి ప్రముఖులు ప్రత్యేకంగా రాశారు. యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ప్రయాణం, ప్రతిభ గురించి బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆలియా భట్ గురించి దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రాశారు. ఆర్యన్ ఖాన్ గురించి ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్ రాశారు. అలాగే గాయకుడు ఏఆర్ రెహమాన్.. ఫహీమ్ అబ్దుల్లా గురించి, నటుడు అల్లు అర్జున్.. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ గురించి రాశారు. వేదాంగ్ రైనా గురించి ఇంతియాజ్ అలీ, పార్వతి తిరువోతు గురించి రిచా చద్దా తమ అభిప్రాయాలను తెలియజేశారు.

అన్ని రంగాల నుంచి ప్రముఖులు

క్రీడా రంగం నుంచి వైభవ్ సూర్యవంశీతో పాటు భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్, మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, హాకీ గోల్‌కీపర్ సవితా పునియా పేర్లు ఉన్నాయి. సినిమా రంగం నుంచి ఆలియా భట్, ఆర్యన్ ఖాన్, అలీ ఫజల్, సాయి పల్లవి, నయనతార, విక్కీ కౌశల్, ఇషాన్ ఖట్టర్ వంటి వారు చోటు దక్కించుకున్నారు. సంగీత రంగంలో దిల్జిత్ దోసాంజ్, అనిరుధ్ రవిచందర్, ఏఆర్ రెహమాన్ ప్రస్తావించిన ఫహీమ్ అబ్దుల్లా, ప్రతీక్ కుహాద్ వంటి పేర్లు ఉన్నాయి.

సైన్స్, ఆరోగ్య రంగాల్లో అంతరిక్ష యాత్రికుడు శుభాంశు శుక్లా, నీనా గుప్తా, రేవంత్ హిమత్సింగ్కా వంటి వారికి గుర్తింపు లభించింది. వ్యాపారం, సాంకేతిక రంగాల్లో స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన, పీయూష్ బన్సల్, రాధికా గుప్తా, తరుణ్ మెహతా వంటి వారు ఉన్నారు. సామాజిక మార్పు, హక్కుల కోసం పనిచేస్తున్న పలువురినీ ఈ జాబితాలో చేర్చారు. అంటే ఈ ఎంపిక కేవలం సినిమా, క్రీడలకే పరిమితం కాకుండా అనేక రంగాల్లో ఎదుగుతున్న భారతీయ ప్రతిభకు గుర్తింపుగా నిలిచింది.

డిసెంబర్ 12న ముంబైలో ప్రత్యేక వేడుక

ఈ జాబితా విడుదల సందర్భంగా డిసెంబర్ 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో ఆలియా భట్, పవన్ కుమార్ చందన, ఆర్యన్ ఖాన్, పాయల్ కపాడియా, తేజా రియో సహా పలువురు పాల్గొననున్నారు. గాయకుడు ఫహీమ్ అబ్దుల్లా ప్రత్యేక సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు. ఇక టైమ్ 100 నెక్ట్స్ ఇండియా ప్రత్యేక సంచిక డిసెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ఇందులో ఎంపికైన వారి గురించి ప్రత్యేక కథనాలు, వివరాలు ప్రచురించనున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us