AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైభవ్ సూర్యవంశీ

వైభవ్ సూర్యవంశీ

వైభవ్ సూర్యవంశీ 27 మార్చి 2011లో జన్మించాడు. బీహార్, రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడే ఈ భారతీయ క్రికెటర్.. 2024లో అంటే 12 సంవత్సరాల వయసులో రంజీ ట్రోఫీలో బీహార్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. ఆ తరువాత 13 సంవత్సరాల వయసులో రాజస్థాన్ రాయల్స్‌లో చేరి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాంట్రాక్టుపై సంతకం చేసి అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. సూర్యవంశీ బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాజ్‌పూర్‌లో పెరిగాడు. తొమ్మిదేళ్ల వయసులో క్రికెట్ ఆడటం ప్రారంభించి ప్రారంభంలో అతని తండ్రి వద్ద శిక్షణ పొందాడు. వైభవ్ సూర్యవంశీ 2025 ఏప్రిల్ 28న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్‌ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా, ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండవ అతి పిన్న వయస్కుడిగా, భారతీయుడిగా నిలిచాడు.

ఇంకా చదవండి

U19 Asia Cup 2025 : అండర్-19 ఆసియా కప్ టీమ్ ప్రకటించిన బీసీసీఐ..కెప్టెన్‎గా ఆయుష్ కానీ అందరి చూపు బుడ్డోడి మీదే

భారత యువ క్రికెట్ జట్టు అండర్-19 ఆసియా కప్‌లో తమ జెండాను ఎగురవేయడానికి సిద్ధమవుతోంది. డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 21 వరకు దుబాయ్‌లో జరగనున్న ఈ ముఖ్యమైన టోర్నమెంట్ కోసం బీసీసీఐ శనివారం 15 మంది సభ్యులతో కూడిన భారత స్క్వాడ్‌ను ప్రకటించింది.

  • Rakesh
  • Updated on: Nov 30, 2025
  • 2:48 pm

Asia Cup U-19 : బుడ్డోడికి బంపర్ ఆఫర్..అండర్-19 ఆసియా కప్‎లో చోటు..కెప్టెన్‌గా 17 ఏళ్ల స్టార్

భారత క్రికెట్ భవిష్యత్తుకు పునాది వేసే టోర్నమెంట్లలో ఒకటైన అండర్-19 ఆసియా కప్ కోసం టీమిండియా జట్టును ప్రకటించారు. యువ క్రికెట్‌లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా ఉన్న, 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. డిసెంబర్ 12 నుంచి 21 వరకు దుబాయ్‌లో జరగనున్న ఈ వన్డే టోర్నమెంట్, వచ్చే ఏడాది జరగబోయే అండర్-19 ప్రపంచకప్‌కు సన్నాహకంగా కూడా ఉపయోగపడుతుంది.

  • Rakesh
  • Updated on: Nov 28, 2025
  • 1:31 pm

Vaibhav Suryavanshi : ఆసియా కప్‌లో వైభవ్ సూర్యవంశీ ఊచకోత..పాకిస్తాన్ స్టార్ కంటే మనోడే నంబర్-1

ఏసీసీ మెన్స్ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2025 టోర్నమెంట్ విజేతగా పాకిస్తాన్ షాహీన్స్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఏ జట్టును ఓడించి పాకిస్తాన్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ యువ ఆటగాళ్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది. వారిలో ఓపెనర్ మాజ్ సదాకత్ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

  • Rakesh
  • Updated on: Nov 24, 2025
  • 11:24 am

నువ్వు తోపురా భయ్.. ఏకంగా 89 మంది ప్లేయర్లకు ఇచ్చిపడేసిన వైభవ్ సూర్యవంశీ.. అదేంటంటే..?

Vaibhav Suryavanshi, Rising Star Asia Cup 2025: వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో ఆడుతున్నాడు. ఇండియా A తరపున అతని అద్భుతమైన ప్రదర్శనలతో కొన్ని రికార్డుల్లో ఈ యంగ్ సెన్సేషన్‌ను నంబర్ 1 ర్యాంకింగ్‌ను సంపాదించిపెట్టాయి.

Vaibhav Abhishek : వైభవ్, అభిషేక్ జోడీ.. ఈ కాంబో కనుక సెట్ అయితే టీ20 రికార్డులు గల్లంతే..అలా ఎప్పుడు అవుతుందంటే ?

రైజింగ్ స్టార్ ఆసియా కప్‌లో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 32 బంతుల్లోనే సెంచరీ కొట్టి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సోషల్ మీడియాలో అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ కనుక టీ20 లో ఓపెనింగ్ చేస్తే ఎలా ఉంటుంది? అని ఒక ప్రశ్న బాగా చక్కర్లు కొడుతోంది.

  • Rakesh
  • Updated on: Nov 18, 2025
  • 4:05 pm

మ్యాచ్‌కు ముందే ప్రత్యర్థుల హార్ట్ బీట్ పెంచిన వైభవ్ సూర్యవంశీ.. 14 ఏళ్లకే ఇలా ఎలాగంటూ..

IND A vs Oman Match: రైజింగ్ స్టార్స్ ఏషియా కప్‌లో ఇండియా-ఏ జట్టు ఓమన్ టీమ్‌తో తలపడనుంది. సెమీ-ఫైనల్‌కు చేరుకోవడానికి ఈ మ్యాచ్ భారత్‌కు చాలా కీలకం. అయితే, అంతకుముందు ఓమన్ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీని కొన్ని ప్రశ్నలు అడిగారు.

IND A vs Oman A: మరోసారి దంచి కొట్టేందుకు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. ఎప్పుడు, ఎక్కడంటే..?

India A vs Oman Rising Stars Asia Cup Live Streaming: ఇండియా ఏ జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో ఓమన్‌తో తలపడనుంది. అందరి దృష్టి మరోసారి యువ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీపై ఉంది. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ సాధించిన తర్వాత, వైభవ్ పాకిస్తాన్‌పై కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

Vaibhav Suryavanshi : రెచ్చగొట్టిన పాక్ బౌలర్‌పై బ్యాట్ ఝళిపించిన వైభవ్ సూర్యవంశీ..ఇది రివెంజ్ అంటే!

ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఏ జట్టు చేతిలో భారత్ ఏ జట్టు 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఏ టీమ్ కేవలం 136 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మాత్రం మెరుపు ఆరంభాన్ని అందించాడు.

  • Rakesh
  • Updated on: Nov 17, 2025
  • 3:17 pm

IND vs PAK: 5 ఫోర్లు, 3 సిక్సర్లతో ఐపీఎల్ బుడ్డోడి బీభత్సం.. కట్‌చేస్తే.. దారుణంగా ఓడిన భారత్

IND A vs PAK A Asia Cup Rising Star: ఇండియా ఏ తరపున వైభవ్ సూర్యవంశీ, నమన్ ధీర్ బలమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. కానీ, ఈ ఇద్దరు తప్ప, మిగతా బ్యాట్స్‌మెన్స్ అందరూ విఫలమయ్యారు. జట్టు కేవలం 136 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ స్కోరు పాకిస్తాన్ షాహీన్‌కు పెద్దగా కష్టంగా అనిపించలేదు.

Vaibhav Suryavanshi : బ్యాటింగులో విధ్వంసం.. మటన్ మానేసిన కోపాన్ని బ్యాట్‌తో చూపిస్తున్న వైభవ్ సూర్యవంశీ

క్రికెట్‌లో ఆటగాళ్లకు ఇష్టమైన ఫుడ్ దొరకకపోతే..ఆ కోపం ఎవరి మీద చూపించాలి ? యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. వైభవ్ సూర్యవంశీకి మటన్, రైస్ అంటే చాలా ఇష్టం. కానీ, క్రికెట్ కెరీర్ కోసం డైటింగ్ మొదలుపెట్టిన వైభవ్.. ఇప్పుడు తన ఫేవరెట్ ఫుడ్‌కు దూరంగా ఉండాల్సి వస్తోంది.

  • Rakesh
  • Updated on: Nov 16, 2025
  • 3:47 pm