IPL 2026: ఒక్కరు, ఇద్దరు కాదు భయ్యో.. ఏకంగా 11 మంది.. ప్రత్యర్థులు పచ్చడైపోవాల్సిందే
IPL 2026 Uncapped Players: ఐపీఎల్ అంటేనే కొత్త ప్రతిభకు కేరాఫ్ అడ్రస్.! 2026 సీజన్‌లో స్టార్ ఆటగాళ్ల కంటే ఎక్కువగా అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ హాట్ టాపిక్ అయ్యారు. కేవలం లక్షల్లో బేస్ ప్రైస్ ఉండి, ఏకంగా 14 కోట్లకు పైగా ధర పలికిన ఆణిముత్యాలు వీరు. చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఆర్సీబీ వరకు ఏ జట్టు ఎవరిని కొనుగోలు చేసింది? గ్రౌండ్‌లో సునామీ సృష్టించే ఆ డేంజరస్ ప్లేయర్స్ ఎవరో ఓసారి చూద్దాం..

IPL 2026 Uncapped Players: ఐపీఎల్ 2026 వేలం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అన్‌క్యాప్డ్ ప్లేయర్లపై కాసుల వర్షం కురిసింది. అనుభవం లేకపోయినా, దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన కుర్రాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటాపోటీగా వేలం పాడాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు భవిష్యత్తు స్టార్లను పసిగట్టడంలో సఫలమయ్యాయి.
CSK అమ్ములపొదిలో అస్త్రాలు: ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ..
ఈ సీజన్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన పేరు ప్రశాంత్ వీర్. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ 20 ఏళ్ల స్పిన్ ఆల్‌రౌండర్ కోసం CSK ఏకంగా రూ. 14.20 కోట్లు ఖర్చు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఇతను రికార్డు సృష్టించాడు.
అలాగే రాజస్థాన్‌కు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ కార్తీక్ శర్మ కూడా రూ.14.20 కోట్లు పలికి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వీరిద్దరూ చెన్నై జట్టుకు ప్రధాన బలంగా మారనున్నారు.
RCB బ్రహ్మాస్త్రం: మంగేష్ యాదవ్..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మధ్యప్రదేశ్ యువ సంచలనం మంగేష్ యాదవ్ కోసం రూ. 5.20 కోట్లు వెచ్చించింది. డొమెస్టిక్ క్రికెట్‌లో అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే ఇతను తన ఆల్‌రౌండ్ ప్రతిభతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ లో ఇతను కీలక పాత్ర పోషించనున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ లో ‘కాశ్మీర్ ఎక్స్‌ప్రెస్’..
బౌలింగ్ విభాగంలో జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ హాట్ కేకులా మారాడు. రంజీ ట్రోఫీలో 60 వికెట్లతో చెలరేగిన ఇతడిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 8.40 కోట్లకు దక్కించుకుంది. డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడంలో ఇతను సిద్ధహస్తుడు.
మరికొంత మంది కీలక ఆటగాళ్లు..
వీరితో పాటు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకున్న అండర్-19 స్టార్ వైభవ్ సూర్యవంశీ, కేకేఆర్ హిట్టర్ తేజస్వి సేయింగ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన విధ్వంకర బ్యాటర్ సలీల్ అరోరా (కోటిన్నర ధర) ఈ సీజన్‌లో మ్యాచ్ విన్నర్లుగా మారే అవకాశం ఉంది. మొత్తానికి IPL 2026 ఈ యువ కిశోరాల పోరాటంతో రసవత్తరంగా మారనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
