AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎలక్ట్రిక్‌ స్కూటీల్లో టాప్‌ 5 ఇవే! కొనాలనుకునేవారు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం వేగంగా పెరుగుతున్న వేళ, బ్యాటరీ లైఫ్‌పై ఉన్న భయాలను తగ్గించేందుకు ప్రముఖ ఈవీ కంపెనీలు 8 సంవత్సరాల వరకు ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ వారంటీ అందిస్తున్నాయి. ఓలా, ఏథర్, టీవీఎస్, బజాజ్, హీరో వంటి సంస్థలు వినియోగదారులకు దీర్ఘకాల భరోసా కల్పించే కొత్త వారంటీ ప్లాన్లతో మార్కెట్లో పోటీపడుతున్నాయి.

SN Pasha
|

Updated on: May 25, 2026 | 9:51 PM

Share
దేశవ్యాప్తంగా పెట్రోల్ స్కూటర్లకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగం వేగంగా పెరుగుతోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, తక్కువ నిర్వహణ ఖర్చులు, ప్రభుత్వ ప్రోత్సాహకాల కారణంగా చాలా మంది వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఈవీ కొనుగోలులో చాలామందిని వెనక్కి తగ్గించే ప్రధాన అంశం బ్యాటరీ జీవితకాలం, భవిష్యత్తులో దాన్ని మార్చాల్సి వస్తే అయ్యే భారీ ఖర్చు. ఈ ఆందోళనలను తగ్గించే దిశగా ప్రముఖ ఈవీ తయారీ సంస్థలు ఇప్పుడు తమ స్కూటర్లపై 8 సంవత్సరాల వరకు పొడిగించిన బ్యాటరీ వారంటీని అందిస్తున్నాయి.

1 / 6
ఈ జాబితాలో ముందున్నది Ola Electric తయారు చేస్తున్న ఓలా ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ స్కూటర్లు. ఈ మోడళ్లపై కంపెనీ స్టాండర్డ్‌గా 8 సంవత్సరాలు లేదా 80 వేల కిలోమీటర్ల వరకు బ్యాటరీ వారంటీ ఇస్తోంది. అదనపు ప్రీమియంతో ఈ పరిమితిని 1.25 లక్షల కిలోమీటర్ల వరకు పెంచుకునే అవకాశం కూడా కల్పిస్తోంది.

2 / 6
పర్ఫార్మెన్స్‌, బిల్డ్ క్వాలిటీకి పేరుగాంచిన Ather Energy సంస్థ తన ఏథర్ 450ఎక్స్, ఏపెక్స్ మోడళ్లకు ‘ఏథర్ ప్రొటెక్ట్’ పథకం కింద 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ అందిస్తోంది. ఎనిమిదేళ్ల తర్వాత కూడా బ్యాటరీ కనీసం 70 శాతం సామర్థ్యాన్ని కొనసాగిస్తుందని సంస్థ హామీ ఇస్తోంది.

3 / 6
ఇక కుటుంబ వినియోగదారుల్లో ఆదరణ పొందిన TVS Motor Company టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్లపై కూడా కొత్త వారంటీ ప్యాకేజీలు అందుబాటులోకి వచ్చాయి. టాప్ వేరియంట్లను కొనుగోలు చేసే కస్టమర్లు అదనపు వారంటీ ఎంపికతో 8 సంవత్సరాల వరకు బ్యాటరీ భద్రత పొందవచ్చు.

4 / 6
క్లాసిక్ డిజైన్‌తో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Bajaj Auto బజాజ్ చేతక్ ప్రీమియం స్కూటర్‌కు కూడా ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ వారంటీ అందిస్తోంది. విశాలమైన సర్వీస్ నెట్‌వర్క్‌తో పాటు దీర్ఘకాల బ్యాటరీ అస్యూరెన్స్‌ను కంపెనీ ప్రధాన ఆకర్షణగా నిలుపుతోంది.

5 / 6
అలాగే Hero MotoCorp సంస్థకు చెందిన హీరో విడా వి1 ప్రో స్కూటర్ రిమూవబుల్ బ్యాటరీ ఫీచర్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇంట్లోనే సులభంగా ఛార్జింగ్ చేసుకునే వీలుతో పాటు దీర్ఘకాల బ్యాటరీ వారంటీ ప్లాన్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.

6 / 6
Follow Us