అమలాపురం పట్టణంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ కొబ్బరికాయ నుంచి రావిచెట్టు మొలిచి, స్థానికులను ఆశ్చర్యపరిచింది. కార్తీక మాసం కావడంతో దీనిని శివకేశవుల మహిమగా భావిస్తున్నారు. ఈ అరుదైన మొక్కను సమీప ఆలయానికి తరలించి, ప్రత్యేక పూజలు చేయనున్నారు.