AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్వాన్ తుఫాన్ తీరం దాటేది ఇక్కడే..! ఏపీకి భారీ వర్ష సూచన.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం అక్వాన్ తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నవంబర్ 20న నెల్లూరు–తుని మధ్య ఏపీ, యానాం తీరాలను దాటే సూచనలు ఉన్నాయి. తీరం దాటే సమయంలో గంటకు 120–145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉంది. తీరప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

అక్వాన్ తుఫాన్ తీరం దాటేది ఇక్కడే..! ఏపీకి భారీ వర్ష సూచన.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
Cyclone Akvan Update
Shaik Madar Saheb
|

Updated on: Nov 16, 2026 | 12:32 PM

Share

అర్నబ్‌, మురసు తుఫాన్ల బీభత్సం నుంచి ఏపీ కోలుకోకముందే.. అక్వాన్ తుఫాన్‌ తరుముకొస్తోంది.. బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది సోమవారం సాయంత్రానికి తుఫాన్‌గా.. మంగళవారం తీవ్ర తుపానుగా మారనుంది.. తుఫానుగా మారిన తర్వాత.. అక్వాన్ గా నామకరణం చేయనున్నారు. అయితే.. తుఫాను తీరం దాటే సమయంపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 20వ తేదీ మధ్యాహ్నం సమయానికి అతి తీవ్ర తుఫానుగా మారి నెల్లూరు – తుని మధ్య ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది..

ప్రస్తుతం తీవ్ర వాయుగుండం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 800 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 700 కిలోమీటర్లు, గోపాల్‌పూర్ కు 910కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 6 కి.మీ వేగంతో కదులుతోంది. ఇది వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ఈ రోజు సాయంత్రానికి తుఫానుగా, నవంబర్ 17 సాయంత్రానికి తీవ్ర తుఫానుగా బలపడనుంది..

వాయువ్య దిశగా కదులుతూ, ఇది శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు, తుని మధ్య తీరాన్ని అతి తీవ్రమైన తుఫానుగా దాటే అవకాశం ఉంది. మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లకూడదు. దీని ప్రభావం వల్ల, గురువారం – శుక్రవారం తీరప్రాంత ఆంధ్రప్రదేశ్‌లో బలమైన గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది; కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తీరం దాటే సమయంలో 120-145 కిమీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సిఈవో ప్రఖర్ జైన్ సూచించారు.

Follow Us