AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Okra: అర్రెర్రె.. ఇన్ని రోజులు ఈ మ్యాటర్‌ తెలియలేదే! బెండకాయలు తింటే నిజంగా లెక్కలు వస్తాయా?

Okra Benefits: బెండకాయల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడంలో పాత్ర పోషించవచ్చు. కొన్ని పరిశోధనల్లో బెండకాయలోని పదార్థాలకు నాడీ వ్యవస్థకు రక్షణ కల్పించే లక్షణాలు ఉండవచ్చని గుర్తించారు. 2025లో ప్రచురితమైన ఒక పరిశోధన సమీక్షలో బెండకాయలోని పోషకాలు, బయోయాక్టివ్..

Okra: అర్రెర్రె.. ఇన్ని రోజులు ఈ మ్యాటర్‌ తెలియలేదే! బెండకాయలు తింటే నిజంగా లెక్కలు వస్తాయా?
Eating Okra
Subhash Goud
|

Updated on: Nov 16, 2026 | 12:04 PM

Share

Okra: బెండకాయ.. చాలామంది ఇష్టంగా తినే కూరగాయల్లో ఒకటి. అయితే బెండకాయలు తింటే పిల్లలకు లెక్కలు బాగా వస్తాయని, మెదడు చురుగ్గా పనిచేస్తుందని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా పిల్లలు చదువులో రాణించాలంటే బెండకాయలు తినిపించాలని తల్లిదండ్రులకు సూచిస్తుంటారు. అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది? బెండకాయలు తినడం వల్ల నిజంగానే గణిత సామర్థ్యం పెరుగుతుందా? దీని వెనుక ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయా?

చిన్నప్పటి నుంచి బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయని చాలామంది చెబుతుంటారు. అందుకే పిల్లలకు బెండకాయ కూర తినిపించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. అయితే బెండకాయలు తినడం వల్ల గణితంలో నైపుణ్యం పెరుగుతుందని చెప్పడానికి ఇప్పటివరకు బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ ఇందులో ఉండే పోషకాలు శరీర ఆరోగ్యానికి, మెదడు సాధారణ పనితీరుకు పరోక్షంగా తోడ్పడవచ్చు.

బెండకాయల్లో ఉండే పోషకాలేంటి?

బెండకాయల్లో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి6, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు లభిస్తాయి. 100 గ్రాముల పచ్చి బెండకాయల్లో సుమారు 33 కేలరీలు, 3.2 గ్రాముల ఫైబర్, 23 మిల్లీగ్రాముల విటమిన్ సి, 60 మైక్రోగ్రాముల ఫోలేట్ ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడతాయి.

మెదడు ఆరోగ్యానికి బెండకాయలు ఉపయోగపడతాయా?

బెండకాయల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడంలో పాత్ర పోషించవచ్చు. కొన్ని పరిశోధనల్లో బెండకాయలోని పదార్థాలకు నాడీ వ్యవస్థకు రక్షణ కల్పించే లక్షణాలు ఉండవచ్చని గుర్తించారు.

2025లో ప్రచురితమైన ఒక పరిశోధన సమీక్షలో బెండకాయలోని పోషకాలు, బయోయాక్టివ్ సమ్మేళనాల ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. అయితే వీటి ప్రభావాన్ని మనుషుల్లో మరింత విస్తృతంగా పరిశీలించాల్సి ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.

పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుతుందా?

పిల్లల మెదడు ఎదుగుదలకు సరైన పోషకాహారం చాలా ముఖ్యం. బెండకాయల్లో ఉండే ఫోలేట్, విటమిన్ బి6, ఇతర పోషకాలు ఆరోగ్యకరమైన శరీర విధులకు తోడ్పడతాయి. అయితే కేవలం బెండకాయలు తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని లేదా పిల్లలు చదువులో మొదటి స్థానంలో నిలుస్తారని చెప్పలేం. పిల్లలకు ఆకుకూరలు, పండ్లు, పప్పులు, ధాన్యాలు, పాలు, ఇతర పోషకాహారాన్ని సమతుల్యంగా అందించాలి.

జీర్ణక్రియకు కూడా మంచిదే

బెండకాయల్లో ఉండే పీచు పదార్థం జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులోని ఫైబర్ కడుపు నిండిన భావనను ఎక్కువసేపు కొనసాగించడంలో తోడ్పడుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిలకు ఉపయోగమా?

బెండకాయల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదింపజేసి భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు తోడ్పడవచ్చు. బెండకాయ పొడి, సప్లిమెంట్లపై జరిగిన కొన్ని అధ్యయనాల్లో కూడా ప్రయోజనాలు కనిపించాయి. అయితే వీటిని మధుమేహానికి మందులకు ప్రత్యామ్నాయంగా భావించకూడదు.

చివరిగా..

బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయన్నది ఎలాంటి ఆధారాలు లేవంటున్నారు నిపుణులు. కానీ ఇందులోని ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పిల్లల తెలివితేటలు, జ్ఞాపకశక్తి, చదువులో ప్రతిభ పెరగాలంటే మంచి ఆహారంతో పాటు తగినంత నిద్ర, వ్యాయామం, చదువుపై ఏకాగ్రత కూడా అవసరం. అందుకే బెండకాయలను ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది.

(నోట్‌- ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల వివరాలు, గత అధ్యాయనాల నివేదికల ఆధారంగా అందిస్తున్నాము. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

ఇది కూడా చదవండి: Success Story: చిన్న వయసులోనే కాలేజీకి గుడ్‌బై.. 19 ఏళ్లకే OYO ప్రారంభం.. నేడు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి!

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బెండకాయలు తింటే నిజంగా లెక్కలు బాగా వస్తాయా?
బెండకాయలు తింటే నిజంగా లెక్కలు బాగా వస్తాయా?
అమెరికాలో ఏం జరిగింది? 13 రోజులుగా వీడని శ్రీజ మిస్సింగ్ మిస్టరీ
అమెరికాలో ఏం జరిగింది? 13 రోజులుగా వీడని శ్రీజ మిస్సింగ్ మిస్టరీ
ఏలూరు పంట పొలాల్లో అరుదైన పక్షుల సందడి!
ఏలూరు పంట పొలాల్లో అరుదైన పక్షుల సందడి!
మర్యాద రామన్నలో నటించిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా?
మర్యాద రామన్నలో నటించిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా?
19 ఏళ్లకే OYO ప్రారంభం.. నేడు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి!
19 ఏళ్లకే OYO ప్రారంభం.. నేడు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి!
మీ విజయ రహస్యం ఎవరికీ చెప్పకండి..ఈ కథ తెలిస్తే మీ ఆలోచన మారుతుంది
మీ విజయ రహస్యం ఎవరికీ చెప్పకండి..ఈ కథ తెలిస్తే మీ ఆలోచన మారుతుంది
ఎంత ముదురు మటన్‌ అయినా.. ఇవి వేస్తే నిమిషాల్లోనే ముక్క మెత్తగా..
ఎంత ముదురు మటన్‌ అయినా.. ఇవి వేస్తే నిమిషాల్లోనే ముక్క మెత్తగా..
రోజ్ వాటర్‌తో ముఖం కాంతివంతంగా మారుతుందా? అసలు నిజం ఇదే!
రోజ్ వాటర్‌తో ముఖం కాంతివంతంగా మారుతుందా? అసలు నిజం ఇదే!
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి