రైస్ కుక్కర్‌లో వండిన అన్నం తినడం ఆరోగ్యానికి మంచిది కాదా?

16 November 2026

TV9 Telugu

TV9 Telugu

మ‌నకు వ‌రి అన్నమే ప్రధాన‌మైన ఆహారం. దేశంలోని చాలా ప్రాంతాల్లో వ‌రి అన్నాన్ని ఆహారంగా తీసుకుంటారు

TV9 Telugu

అయితే సాధారణ పద్ధతిలో కాకుండా ఇప్పుడు ఎక్కువగా ఎలక్ట్రిక్‌ రైస్‌ కుక్కర్‌ (Electric Rice coocker) లో వంట చేస్తున్నారు

TV9 Telugu

సులువైన పద్ధతి కావడంతో ఎక్కువ మంది ఈ పద్ధతినే ఫాలో అవుతున్నారు. అయితే ఎలక్ట్రిక్‌ రైస్‌ కుక్కర్‌లో వండిన అన్నం ఆరోగ్యానికి మంచిది కాదని కొందరు అంటున్నారు

TV9 Telugu

అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం అలాంటిదేం లేదని చెబుతున్నారు. అనారోగ్య సమస్యలు వస్తాయనే వాదనను కొట్టిపారేస్తున్నారు

TV9 Telugu

పైగా ప్రెష‌ర్‌తో ఉడ‌క‌డంవ‌ల్ల అన్నం రుచిగా ఉంటుంద‌ని చెబుతున్నారు. కుక్కర్‌లో వండిన అన్నంలో పిండి ప‌దార్థం తొల‌గిపోవ‌డంవ‌ల్ల ఫ్యాట్ కంటెంట్ కూడా త‌క్కువ‌గా ఉంటుంద‌ట

TV9 Telugu

రైస్‌ కుక్కర్‌లో వండిన అన్న బాగా ఉడకడంవల్ల సులువుగా జీర్ణమ‌వుతుంది. పైగా అన్నంలో ప్రోటీన్‌లు, పిండి ప‌దార్థాలు, ఫైబ‌ర్ లాంటి స్థూల పోష‌కాలు ఉంటాయి

TV9 Telugu

పొయ్యి మీది మాదిరిగా రైస్‌ కుక్కర్‌లో అన్నం ఎగరకపోవడం వల్ల మెతుకులు ఇరగకుండా ఉంటాయి

TV9 Telugu

ఎక్కువ ప్రెష‌ర్‌లో అన్నం వండ‌టంవ‌ల్ల బియ్యంలో, నీళ్లలో ఉండే హానిక‌ర‌ శిలీంధ్రాలు, బ్యాక్టీరియా నాశ‌న‌మైపోతాయి