బ్రోకలీ తినే పద్ధతి మారిస్తే.. ఆరోగ్యానికి డబుల్ బెనిఫిట్స్!
Jyothi Gadda
16 November 2026
బ్రోకలీలో ఉండే సల్ఫోరాఫెన్ అనే శక్తివంతమైన సమ్మేళనం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి, మధుమేహాన్ని నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
బ్రోకలీలో విటమిన్ సి, కె, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడి, యవ్వనంగా ఉంచడంలో దోహదపడతాయి.
ఇందులో ఉండే కాల్షియం, విటమిన్ కె ఎముకలను బలంగా మార్చడానికి, బోలు ఎముకల వ్యాధి రాకుండా నివారించడానికి ఎంతగానో సహాయపడతాయి.
బ్రోకలీ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి, రక్తనాళాలు శుభ్రపడి గుండె జబ్బుల ముప్పు చాలావరకు తగ్గుతుంది.
ఇందులో ఉండే విటమిన్ ఎ, లుటిన్ కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా, కంటి సంబంధిత సమస్యలు రాకుండా రక్షణ కల్పిస్తాయి.
బ్రోకలీలో ఉండే విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలను ఉత్తేజపరిచి జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
ఫైబర్ అధికంగా ఉండే ఈ కూరగాయ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేసి గట్ ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
క్యాన్సర్ కారక కణాలతో పోరాడే శక్తి బ్రోకలీకి ఉంది. ఇది శరీరంలో ఉండే వ్యర్థాలను తొలగించి, డిటాక్సిఫై చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
రోజూ ఒక కప్పు ఉడికించిన సోయాబీన్స్ తిన్నారంటే..ఈ సమస్యలన్నీ పరార్!
ఈ దిశలో మందార మొక్కను నాటితే ఐశ్వర్యం మీ వెంటే!
వర్షాకాలంలో రాగులు వాడుతున్నారా..? ఇది తెలుసుకోండి..!