తిరుమల శ్రీవారిని దేశంలోని వివిధ ప్రాంతాల్లో భక్తులు భిన్న పేర్లతో పిలుస్తారు. పంజాబ్, మహారాష్ట్ర వంటి ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల్లో బాలాజీ అని, తెలుగు రాష్ట్రాల్లో వెంకటేశ్వర స్వామి, గోవిందుడు, ఏడుకొండలవాడు అని, తమిళనాడులో పెరుమాళ్ అని, కర్ణాటకలో వెంకటరమణ అని, కేరళలో వెంకటాచలపతి అని పిలవడం విశేషం.