లోన్ కట్టకపోతే పీఎఫ్ నిధులు బ్యాంకులు జప్తు చేయవచ్చా..?

Venkatrao Lella

Images: Pinterest

15 NOV 2026

ఏదైనా ఆర్ధిక సంస్థ నుంచి రుణాలు తీసుకుని చెల్లించలేని పక్షంలో డీఫాల్టర్‌గా గుర్తించినప్పుడు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(EPF), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) ఖాతాలలో ఉన్న డబ్బును బ్యాంకులు లేదా రుణదాతలు జప్తు చేయవచ్చా.. సమాధానాలు చూద్దాం.

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(EPF) చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం ఉద్యోగి ఖాతాలోని సొమ్మును కోర్టులు లేదా బ్యాంకులు  జప్తు చేయడం కుదరదు. దీంతో పీఎఫ్ నిధులకు పూర్తి రక్షణ ఉంటుంది.

హోమ్ లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించడంలో విఫలమైనప్పుడు పీఎఫ్ బ్యాలెన్స్ బ్యాంకులు తీసుకోలేవు. ఈపీఎఫ్ఓను సంప్రదించి మీ పీఎఫ్ ఖాతాలోని బ్యాలెన్స్‌ను బదిలీ చేయమని అడగలేవు.

పెన్షన్, బీమా పథకాలకు చట్టప్రకారం రక్షణ ఉంటుంది. ఈ కఠిన నిబంధనల వల్ల బ్యాంకులు ఏమీ చేయలేవు. 

ఈపీఎఫ్ తరహాలోనే పీపీఎఫ్ అకౌంట్లలోని డబ్బులు కూడా జప్తు చేయలేరు. ప్రభుత్వ పొదుపు ప్రోత్సాహక చట్టంలోని సెక్షన్ 14ఏ ప్రకారం పీపీఎఫ్ ఖాతాలోని డబ్బును కోర్టు ఆర్డర్స్ ద్వారా జప్తు చేయలేరు.

ఈ చట్టపరమైన రక్షణ EPF లేదా PPF ఖాతాలో ఉన్న డబ్బుకు మాత్రమే వర్తిస్తుంది. మీరు ఆ డబ్బలను వేరే అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేస్తే వర్తించదు.

సాధారణ బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తే అలాంటి రక్షణను కోల్పోతారు. దీంతో ఈ నిబంధనల గురించి ఖాతాదారులు తెలుసుకోవాలి.

సివిల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 60, PF, PPF డిపాజిట్లను మాత్రమే జప్తు నుంచి మనహాయింపు ఉంటుంది. ఇలాంటి సమయంలో మీకు సంబంధించిన ఇతర ఆస్తుల నుంచి రుణం వసూలు చేస్తారు.