AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Secrets: ఒక చిన్న టీ స్టాల్‌తో కోటి టర్నోవర్ సాధించడం ఎలా? ఎవ్వరికి తెలియని సీక్రెట్‌ లెక్కలివే!

Business Secrets: రవి 26 ఏళ్ల B.Tech గ్రాడ్యుయేట్, రెండేళ్లుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇంటర్వ్యూలలో తిరస్కరణలు ఎదుర్కొని నిరాశలో ఉన్నప్పుడు, ఒక బస్ స్టాండ్ దగ్గర రద్దీగా ఉండే టీ స్టాల్‌ను చూశాడు. రోజుకు 500 కప్పులు అమ్ముతున్న ఆ స్టాల్..

Business Secrets: ఒక చిన్న టీ స్టాల్‌తో కోటి టర్నోవర్ సాధించడం ఎలా? ఎవ్వరికి తెలియని సీక్రెట్‌ లెక్కలివే!
Business Secrets
Subhash Goud
|

Updated on: Nov 16, 2026 | 12:26 PM

Share

Business Secrets: రూ.10 టీ కప్పుతో ఏడాదికి కోటి రూపాయల టర్నోవర్ సాధించడం అసాధ్యం అని చాలామంది అనుకుంటారు. కానీ, B.Tech పూర్తి చేసి, ఉద్యోగం దొరక్క నిరాశలో ఉన్న రవికి తన తాతయ్య వెంకటరామయ్య, కేవలం లెక్కలతో అది ఎలా సాధ్యమో చూపించారు. ఈ కథ యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిచ్చే అనేక వ్యాపార పాఠాలను కలిగి ఉంది. అయితే ఈ స్టోరీలో ఇద్దరి వ్యక్తుల పేర్లతో సంబోధిస్తూ లైఫ్‌లో సక్సెస్‌ ఎలా వస్తుందో చూద్దాం..

రవి 26 ఏళ్ల B.Tech గ్రాడ్యుయేట్, రెండేళ్లుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇంటర్వ్యూలలో తిరస్కరణలు ఎదుర్కొని నిరాశలో ఉన్నప్పుడు, ఒక బస్ స్టాండ్ దగ్గర రద్దీగా ఉండే టీ స్టాల్‌ను చూశాడు. రోజుకు 500 కప్పులు అమ్ముతున్న ఆ స్టాల్ అతనికి ఒక ఆలోచనను ఇచ్చింది: “ఇది ఉద్యోగం కన్నా బెటర్ కదా!” అని. అయితే, ఇంట్లోవాళ్లు, స్నేహితులు అతన్ని నిరుత్సాహపరిచారు. తన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి, నలభై ఏళ్లు కిరాణా వ్యాపారం చేసి, నలుగురు పిల్లలను చదివించిన తన తాతయ్య వెంకటరామయ్య దగ్గరికి వెళ్ళాడు.

ఇది కూడా చదవండి: Okra: అర్రెర్రె.. ఇన్ని రోజులు ఈ మ్యాటర్‌ తెలియలేదే! బెండకాయలు తింటే నిజంగా లెక్కలు వస్తాయా?

ఇవి కూడా చదవండి

తాతయ్య తన పాత లెక్కల పుస్తకాన్ని తీసి, వ్యాపారం అంటే భావోద్వేగం కాదని, అది కేవలం లెక్క అని వివరించారు. ఒక కప్పు టీ ఖర్చును రవి లెక్కించాడు: పాలు, పంచదార, టీ పొడికి రూ.3.50, గ్యాస్, కప్పుకు రూ.1.50. మొత్తం ఖర్చు రూ.5. అంటే, ఒక కప్పుపై రూ.5 లాభం. రోజుకు 500 కప్పులు అమ్మితే రోజు అమ్మకం రూ.5,000. నెలకు రూ.1.5 లక్షలు. ఏడాదికి రూ.18 లక్షల టర్నోవర్. రవి కళ్ళు మెరిశాయి. అయితే, తాతయ్య టర్నోవర్ వేరు, లాభం వేరు అని స్పష్టం చేశారు. అద్దె, సహాయకుడి జీతం, కరెంట్, వేస్టేజ్ వంటి ఖర్చులు తీసేస్తే నెలకు రూ.30,000 నుంచి రూ.50,000 మిగులుతుందని, ఇది మంచి ఉద్యోగంతో సమానమని వివరించారు.

ఇది కూడా చదవండి: Success Story: చిన్న వయసులోనే కాలేజీకి గుడ్‌బై.. 19 ఏళ్లకే OYO ప్రారంభం.. నేడు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి!

కోటి టర్నోవర్ ఎలా వస్తుందని రవి అడిగినప్పుడు తాతయ్య అసలు రహస్యాన్ని వెల్లడించారు. ఏడాదికి కోటి రూపాయల టర్నోవర్ సాధించాలంటే రోజుకు సుమారు రూ.27,400 అమ్మాలి. రూ.10 టీతో ఇది రోజుకు 2,700 కప్పులకు సమానం. ఒకే స్టాల్‌తో ఇది అసాధ్యం. అయితే, దానికి మూడు మార్గాలున్నాయని తాతయ్య వివరించారు.

1. మల్టిపుల్ అవుట్‌లెట్‌లు (బహుళ స్టాల్స్): 500 కప్పుల స్టాల్ రూ.18 లక్షలు ఇస్తే అలాంటి ఐదారు స్టాల్స్‌తో సుమారు రూ.90 లక్షల నుంచి కోటి రూపాయల టర్నోవర్ వస్తుంది. అయితే, మొదటి స్టాల్‌ను సమర్థవంతంగా నడపడం ముఖ్యం.

2. స్నాక్స్‌తో సగటు బిల్లు పెంపు: టీ తాగేవారు తరచుగా బిస్కెట్లు, సమోసాలు, బన్స్ కూడా తీసుకుంటారు. స్నాక్స్‌పై లాభాల మార్జిన్ 40% నుంచి 60% వరకు ఉంటుంది. ఒక కస్టమర్ సగటు బిల్లును రూ.10 నుంచి రూ.30కి పెంచగలిగితే, రోజుకు 900 మంది కస్టమర్లతో రెండు మంచి స్టాల్స్‌తోనే కోటి టర్నోవర్ సాధ్యం.

3. బ్రాండింగ్, ఫ్రాంచైజ్: ప్రజలు టీ కోసం కాకుండా, నమ్మకం కోసం వస్తారని తాతయ్య చెప్పారు. ఒకే రుచి, శుభ్రత, పేరుతో ఒక బ్రాండ్‌ను సృష్టించాలి. బ్రాండ్ బలపడితే, ఇతరులు ఆ పేరుతో స్టాల్స్ పెట్టాలనుకుంటారు. ఫ్రాంచైజ్ ఫీజు, టీ పొడి లేదా ప్రీమిక్స్ అమ్మకం ద్వారా ప్రతి కప్పు అమ్మాల్సిన అవసరం లేకుండానే ఆదాయం వస్తుంది.

వ్యాపార విజయానికి తాతయ్య నాలుగు జీవిత సూత్రాలను బోధించారు:

1. చిన్నగా మొదలుపెట్టు, కానీ చిన్నగా ఆలోచించకు.

2. రోజు లెక్క రాయి. లెక్క రాయని వాడు వ్యాపారం చేయడం లేదు.

3. నాణ్యత మారకూడదు. ఒక్క చెడ్డ కప్పు వంద మంచి కప్పుల పేరు చెడగొడుతుంది.

4. కస్టమర్ పేరు గుర్తుపెట్టుకో. నవ్వుతో టీ ఇవ్వు. అదే అసలైన మార్కెటింగ్.

చివరగా, తాతయ్య రవికి ముఖ్యమైన సలహా ఇచ్చారు. “ప్రజలు నీ డిగ్రీ చూసి టీ తాగరు.. నీ టీ రుచి చూసి తాగుతారు. సిగ్గుపడకు. పని చిన్నదని అనుకోకు. ఏ పని చేసినా దాన్ని నంబర్ వన్‌గా చెయ్.” రవి ఆ రోజే స్టాల్ పెట్టాడు. తాతయ్య చెప్పిన సూత్రాలను పాటిస్తూ విజయం వైపు అడుగులు వేశాడు. కోటి టర్నోవర్ అసాధ్యం కాదు, కానీ దానికి లెక్క, క్రమశిక్షణ, నాణ్యత అవసరం.

ఇది కూడా చదవండి: Today Gold Prices: వామ్మో.. బంగారం ధర ఇంత తగ్గిందా..? ఎవ్వరు ఊహించరేమో..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us