Today Gold Prices: వామ్మో.. బంగారం ధర ఇంత తగ్గిందా..? ఎవ్వరు ఊహించరేమో..!
Today Gold Prices: మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ డెలివరీ బంగారం ధర రూ.1,100 వరకు తగ్గి, 10 గ్రాములకు రూ.1,35,682 వద్ద ట్రేడవుతోంది. (MCX బంగారం, వెండి ధరల తగ్గుదల). మరోవైపు, వెండి ధర రూ.5,500 వరకు తగ్గి, కిలోగ్రాముకు రూ.1,70,747కి చేరింది..

Today Gold, Silver Prices: బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉన్నాయి. ట్రేడింగ్ వారంలో మొదటి రోజైన నేడు, ప్రపంచ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. గత వారం రోజులుగా బంగారం ధరలు నిరంతరం హెచ్చుతగ్గులకు లోనవుతూ, కొన్నిసార్లు పెరుగుతూ, కొన్నిసార్లు తగ్గుతూ ఉన్నాయి. బంగారం, వెండి ప్రస్తుత ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం చౌకగా..
అంతర్జాతీయ కామెక్స్ మార్కెట్‌లో ఈరోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి. కామెక్స్‌లో బంగారం ధరలు 0.33% తగ్గి, ఔన్సుకు $3873.50 వద్ద ట్రేడవుతున్నాయి. వెండి ధరలు 3.27% తగ్గి, ఔన్సుకు $47.515 వద్ద ట్రేడవుతున్నాయి.
దేశీయ మార్కెట్‌లో కూడా ధరలు తగ్గాయి:
తాజాగా తులం బంగారంపై 820 రూపాయల వరకు దిగి వచ్చింది. ట్రేడింగ్ వారం మొదటి రోజే బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.1.36 లక్షల వద్ద ట్రేడవుతుండగా, మరోవైపు వెండి ధర కూడా భారీగా పడిపోయి. కిలోగ్రాముకు సుమారు రూ.1.74 లక్షల వద్ద ట్రేడవుతోంది.
MCXలో వెండి ధరలు భారీగా పడిపోయాయి:
మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ డెలివరీ బంగారం ధర రూ.1,100 వరకు తగ్గి, 10 గ్రాములకు రూ.1,35,682 వద్ద ట్రేడవుతోంది. (MCX బంగారం, వెండి ధరల తగ్గుదల). మరోవైపు, వెండి ధర రూ.5,500 వరకు తగ్గి, కిలోగ్రాముకు రూ.1,70,747కి చేరింది.
కొనుగోలుదారులకు ఉపశమనం
మార్కెట్ తెరుచుకున్న వెంటనే బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరల విషయానికి వస్తే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు సుమారు రూ.136,310 వద్ద ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు సుమారు రూ.124,951 వద్ద ఉంది. కాగా, 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు సుమారు రూ.102,233 వద్ద ట్రేడ్ అవుతోంది. బులియన్ మార్కెట్‌లో వెండి ధర కూడా భారీగా తగ్గిపోయింది. దేశీయంగా కిలోగ్రాముకు సుమారు రూ.1,90,000 వద్ద ట్రేడవుతోంది.
ఇది కూడా చదవండి: Fast Food Business: ఫాస్ట్ ఫుడ్ వ్యాపారం ద్వారా నెలకు రూ.3 లక్షలు.. ఆదాయం వెనుకున్న నిజాలు ఏంటో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
