AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చందమామా వస్తున్నాం! నాసా బిగ్ ఎనౌన్స్‌మెంట్

చందమామా వస్తున్నాం! నాసా బిగ్ ఎనౌన్స్‌మెంట్

Phani CH
|

Updated on: May 25, 2026 | 7:27 PM

Share

చంద్రుడిపై శాశ్వతంగా మనుషులు నివసించే దిశగా నాసా భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దక్షిణ ధృవ ప్రాంతంలో మూన్ బేస్ నిర్మాణం, ప్రతి ఆరు నెలలకు వ్యోమగాముల పంపకం, ఆర్టెమిస్ మిషన్లతో చంద్రయానం వేగం పెరుగుతోంది. భవిష్యత్ మార్స్ మిషన్లకు చంద్రుడినే ట్రైనింగ్ సెంటర్‌గా మార్చాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచాన్ని ఉత్కంఠకు గురిచేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ ఆసక్తి నెలకొంది.

చంద్రుడిపై మనుషులు శాశ్వతంగా నివసించే రోజులు దగ్గరపడుతున్నాయా? ఇప్పటివరకు సినిమాల్లో, సైన్స్ ఫిక్షన్ కథల్లో మాత్రమే చూసిన “మూన్ లైఫ్” ఇప్పుడు నిజం కావడానికి సిద్ధమవుతోంది! ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా NASA త్వరలో భారీ ప్రకటన చేయబోతోందన్న వార్త అంతరిక్ష ప్రపంచంలో హాట్‌టాపిక్‌గా మారింది. చంద్రుడిపై కేవలం కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల ప్రయాణం కాదు… ఈసారి లక్ష్యం పూర్తిగా భిన్నం. వ్యోమగాములు అక్కడే నెలల తరబడి ఉండి పని చేసేలా ప్రత్యేక “మూన్ బేస్” నిర్మాణానికి NASA ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే… మానవ చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంపై NASA ప్రత్యేక దృష్టి పెట్టింది. అక్కడ మంచు రూపంలో నీటి ఆనవాళ్లు ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అదే భవిష్యత్తులో మనుషుల నివాసానికి కీలకంగా మారే అవకాశం ఉంది. అందుకే అక్కడే ఈ ప్రత్యేక మూన్ బేస్ నిర్మించాలనే ఆలోచన తో ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ బేస్‌లో వ్యోమగాములు అంతరిక్ష పరిశోధనలు, కొత్త టెక్నాలజీల పరీక్షలు, ఇంకా భూమికి దూరంగా జరిగే భవిష్యత్ మిషన్లకు సన్నాహాలు కూడా చేస్తారని సమాచారం. ముఖ్యంగా మార్స్‌ వంటి గ్రహాలకు వెళ్లే ప్రయాణాలకు ఇది ట్రైనింగ్ సెంటర్‌లా ఉపయోగపడొచ్చని చెబుతున్నారు. అయితే అసలు ప్రశ్న ఏంటంటే… చంద్రుడిపై నిజంగా మనుషులు సాధారణ జీవితాన్ని గడపగలరా? అక్కడ ఆహారం ఎలా? ఆక్సిజన్ ఎలా? తీవ్రమైన చలి, రేడియేషన్‌ను ఎలా తట్టుకుంటారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశం మే 26న ఉండబోతోంది. ఆ రోజు జరగనున్న NASA భారీ బ్రీఫింగ్‌పై ఇప్పుడు ప్రపంచం ఆసక్తి గా చూస్తోంది. చంద్రుడిపై “మనిషి శాశ్వత అడుగు” గురించి ఎలాంటి ప్లాన్ బయటపడబోతోందో తెలుసుకోవాలని అందరూ ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు కలలా అనిపించిన “మూన్ కాలనీ” ఇప్పుడు నిజంగా మన కళ్ల ముందుకు రాబోతుందా? ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని ఉత్కంఠకు గురి చేస్తున్న ప్రశ్న! అంతరిక్ష అన్వేషణలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ నాసా ఇప్పటికే సంచలన ప్రణాళికను ప్రకటించింది. ఇక చంద్రుడిపై కేవలం అడుగుపెట్టడమే కాదు… అక్కడే మానవులు నివసించేలా ప్రణాళిక రచిస్తోంది. భూమి బయట శాశ్వత మానవ నివాసం కలను నిజం చేయాలనే లక్ష్యంతో నాసా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోంది. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తరహాలో, ప్రతి ఆరు నెలలకు వ్యోమగాములను చంద్రుడిపైకి పంపే విధంగా ప్రణాళికలు రూపొందించింది. 2027 నుంచి ప్రతి నెలా చంద్రయాత్రలను నిర్వహించాలనే లక్ష్యాన్ని నాసా పెట్టుకుంది. ఆ ప్రయాణాల కోసం ప్రైవేట్ కంపెనీల సహకారంతో రోవర్లు, ల్యాండర్లు పంపనున్నారు. సుమారు 1.82 లక్షల కోట్లు అంటే దాదాపు 20 బిలియన్ డాలర్లు ఖర్చు చేసి ఈ భారీ ప్రాజెక్టును మూడు దశల్లో అమలు చేయనున్నారు. మొదటి దశలో పరీక్షల కోసం అవసరమైన పరికరాలు, రోవర్లను చంద్రునిపైకి పంపుతారు. రెండవ దశలో వ్యోమగాములు నివసించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. మూడవ దశలో దీర్ఘకాల నివాసానికి అవసరమైన శాశ్వత వ్యవస్థల నిర్మాణం పై దృష్టి పెడతారు. 2029 నాటికి చంద్రుడిపై ప్రాథమిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయని నాసా ఇప్పటికే తెలిపింది. తమ లక్ష్యం కేవలం చంద్రుడిపై జెండా పాతడమే కాదని, అక్కడే మానవ జీవనం కొనసాగించడం అని నాసా అధికారులు స్పష్టం చేశారు. 2026 ఏప్రిల్ 1న నాసా ఆర్టెమిస్ 2 మిషన్‌ ను విజయవంతం చేసింది. 54 ఏళ్ల తర్వాత మానవులను చంద్రునికి సమీపంలోకి తీసుకెళ్లే ఆ మిషన్‌లో నలుగురు వ్యోమగాములు ఓరియన్ క్యాప్సూల్‌లో భారీ ఎస్ఎల్ఎస్ రాకెట్‌తో అంతరిక్షంలోకి బయలుదేరి వెళ్తారు. సుమారు 10 రోజుల పాటు ఆ రాకెట్ చంద్రుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి భూమికి చేరుకుంది. చంద్రునిపై ల్యాండింగ్ కాలేదు. భూమికి అత్యంత దూరం ప్రయాణించడం, అత్యంత వేగంగా తిరిగి రావడం అనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. 4 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి అత్యధిక దూరాన్ని చేరుకుంది. ఆర్టెమిస్ 2 మిషన్ ఫ్రీ రిటర్న్ ట్రాజెక్టరీ విధానంలో సాగింది. 1972 తర్వాత చంద్రుని సమీపానికి మానవులు వెళ్లిన తొలి మిషన్ ఇదే. ఈ యాత్ర చంద్రునిపై దిగకుండా దాని చుట్టూ ప్రయాణించి తిరిగి వచ్చింది. 2022లో ఆర్టెమిస్ 1 మానవరహిత మిషన్‌ను చంద్రుని చుట్టూ పరీక్షించారు. ఇటీవల ఆర్టెమిస్ 2లో వ్యోమగాములు అదే మార్గంలో వెళ్తారు. దీని తర్వాత మరో టెస్ట్ మిషన్ 2029లో ఉండబోతోంది. చంద్రుడిపై మనిషి అడుగు పెట్టనున్నాడు. దాంతో పాటు నాసా ప్రతి ఆరు నెలలకు ఒకసారి మూన్ మిషన్ చేపట్టాలని నిర్ణయించింది. అంతర్జాతీయ భాగస్వాములు, ప్రైవేట్ కంపెనీలతో కలసి ఈ జాయింట్ మిషన్లను ప్లాన్‌ చేసింది నాసా.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సూపర్ సిబిల్ స్కోరుతో వద్దన్నా బ్యాంకుల్లో ప్రీమియర్ బెనిఫిట్స్

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్‌.. మూడేళ్లలో కట్టేసిన చైనా రోబోలు

కీచక భర్తకు బుద్ధి చెప్పిన భార్య..ఏం చేసిందంటే

భారతీయ నర్స్ కుటుంబాన్ని బహిష్కరించిన ఆస్ట్రేలియా

టెకీలకు గడ్డుకాలం.. కెనడా , యూరప్ వైపు చూపు

Follow Us