మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
దక్షిణ అమెరికా ఆండీస్ పర్వతాల్లో 22,000 అడుగులకు పైగా ఎత్తులో జీవిస్తున్న ‘ఆండియన్ లీఫ్-ఇయర్డ్ మౌస్’ ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నివసించే క్షీరదంగా గుర్తింపు పొందింది. తక్కువ ఆక్సిజన్, తీవ్ర చలి, విషపూరిత మొక్కల మధ్య కూడా ఇది మనుగడ సాగిస్తున్న తీరును ‘సైన్స్’ జర్నల్‌లో ప్రచురించిన తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ పరిశోధన గుండెజబ్బులు, క్యాన్సర్ చికిత్సల్లో కొత్త మార్గాలను చూపే అవకాశముందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
భూమిపై ఏ క్షీరదం కూడా జీవించలేని అత్యంత కఠినమైన, ప్రాణాంతక వాతావరణంలో ఒక చిన్న జీవి మనుగడ సాగిస్తూ సరికొత్త రికార్డు సృష్టించింది. దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వత శ్రేణుల్లో సుమారు 22,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నివసిస్తున్న ‘ఆండియన్ లీఫ్-ఇయర్డ్ మౌస్’ అనే చిన్న చిట్టెలుక శాస్త్రవేత్తలకు సైతం సవాలు విసురుతోంది. చిలీ, అర్జెంటీనా దేశాల సరిహద్దుల్లోని ‘పునా డి అటకామా’ అగ్నిపర్వత శిఖరాలపై ఈ ఎలుకలు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఇక్కడ సముద్ర మట్టంతో పోలిస్తే ఆక్సిజన్ కేవలం 44 శాతమే ఉంటుంది. ఉష్ణోగ్రతలు ఎల్లప్పుడూ మైనస్ డిగ్రీల్లోనే నమోదవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ క్షీరదం కూడా ఎక్కువ కాలం జీవించలేదని శాస్త్రవేత్తలు భావించారు. నెబ్రాస్కా-లింకన్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు జే స్టోర్జ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ శిఖరాలపై యాత్రలు చేసి, ఎలుకలను సజీవంగా పట్టుకోవడంతో పాటు మంచులో గడ్డకట్టిన వాటి మమ్మీలను కూడా సేకరించింది. ఈ ఎలుకలు అక్కడ కేవలం బతకడమే కాదు, తమ సంతతిని కూడా వృద్ధి చేసుకుంటున్నాయని తేలడం శాస్త్రవిజ్ఞానానికి పెద్ద సవాలుగా మారింది. ‘సైన్స్’ జర్నల్‌లో ప్రచురించిన తాజా అధ్యయనం ఈ ఎలుకల అద్భుత సామర్థ్యాల వెనుక ఉన్న రహస్యాలను వెల్లడించింది. ఇంతటి విపత్కర వాతావరణాన్ని ఈ ఎలుకలు ఎలా తట్టుకుంటున్నాయో తెలుసుకోవడానికి జన్యు పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. వీటి శరీరంలో వేడిని పుట్టించే ప్రక్రియ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తోంది. ఇవి ఆక్సిజన్ కొరతను తట్టుకోవడానికి రక్తాన్ని చిక్కబరిచే ఎర్ర రక్తకణాలను పెంచడం లేదు. దానికి బదులుగా, అత్యంత వేగంగా శ్వాస తీసుకుంటూ అవసరమైన ప్రాణవాయువును గ్రహిస్తున్నాయి. అంతేకాదు, అక్కడి విషపూరిత మొక్కలను అరిగించుకునేలా, కొవ్వును త్వరగా శక్తిగా మార్చుకునేలా వీటి జన్యువులు రూపాంతరం చెందాయి. ఈ చిన్న ఎలుకపై జరుగుతున్న పరిశోధనలు భవిష్యత్తులో మానవ వైద్య రంగానికి మైలురాయిగా మారనున్నాయి. ముఖ్యంగా గుండె జబ్బులు, క్యాన్సర్ బారిన పడినప్పుడు మానవ శరీర కణాలు తీవ్ర ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటాయి. తక్కువ ఆక్సిజన్ ఉన్నప్పుడు ఈ ఎలుకల కణాలు ఎలా శక్తిని ఉత్పత్తి చేసుకుంటున్నాయో పూర్తిగా అర్థం చేసుకుంటే, మానవులలో వచ్చే ఆయా ప్రాణాంతక వ్యాధులకు సరికొత్త చికిత్సా విధానాలను కనుగొనవచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ సంచలనం.. సరికొత్త శాటిలైట్ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా!
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి
అర్థరాత్రి రోడ్డు దాటుతూ కనిపించిన వింత జీవి!
62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్.. నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే!
కదులుతున్న రైల్లోకి పార్శిల్ డెలివరీ.. వాటే టైమింగ్ బాస్!
అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు!
హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..
బిగ్ బాస్ 10 - కామనర్స్ Vs సెలబ్రిటీస్ మధ్యలో మంట పెట్టిన మానస్
మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు..అసలేం జరిగిందంటే?
మీర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు

