AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోహ్లీ కాదంట.. ఐపీఎల్ బెస్ట్ ఓపెనర్ ఆ బడిత పూజ మాస్టారేనంట.. లెక్కలు చూస్తే బౌలర్లకు ఫీవర్ పక్కా..!

Best IPL Opener: ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ ఓపెనర్ ఎవరనే ప్రశ్నకు చాలా మంది చటుక్కున విరాట్ కోహ్లీ పేరు చెబుతారు. కానీ టీమిండియా మాజీ ఓపెనర్, ప్రముఖ విశ్లేషకుడు ఆకాశ్‌ చోప్రా మాత్రం సరికొత్త విశ్లేషణతో అందరినీ ఆశ్చర్యపరిచారు. రికార్డుల రారాజు కోహ్లీని కాదని, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఆయన అత్యుత్తమ ఓపెనర్‌గా ఎంపిక చేయడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కోహ్లీ కాదంట.. ఐపీఎల్ బెస్ట్ ఓపెనర్ ఆ బడిత పూజ మాస్టారేనంట.. లెక్కలు చూస్తే బౌలర్లకు ఫీవర్ పక్కా..!
Virat Kohli Vaibhav Suryavanshi
Venkata Chari
|

Updated on: May 26, 2026 | 6:55 AM

Share

Best IPL Opener: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేదికగా ఎంతో మంది స్టార్ బ్యాటర్లు ఓపెనర్లుగా వచ్చి అద్భుతాలు సృష్టించారు. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగి పరుగుల వరద పారించిన విరాట్ కోహ్లీ రికార్డులు అసాధారణమైనవి. అయితే ప్రస్తుత ఫామ్, దూకుడు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆకాశ్‌ చోప్రా ఒక ప్రత్యేక విశ్లేషణ చేశారు. లీగ్‌లో అత్యంత ప్రమాదకరమైన, అత్యుత్తమ ఓపెనర్ రేసులో విరాట్ కోహ్లీ కంటే యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఎంతో మెరుగ్గా ఉన్నాడని ఆయన అభిప్రాయపడ్డాడు. పవర్‌ప్లేను పూర్తిగా వాడుకుంటూ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే విధానంలో వైభవ్ ప్రత్యేక శైలిని కలిగి ఉన్నాడని కొనియాడాడు.

వైభవ్ సూర్యవంశీ ప్రత్యేకత ఇదే..

క్రీజులోకి వచ్చిన మొదటి బంతి నుంచే భారీ షాట్లతో విరుచుకుపడడం వైభవ్ ప్రత్యేకత అని చోప్రా విశ్లేషించాడు. ఆధునిక టీ20 క్రికెట్‌కు కావాల్సిన అసలైన దూకుడు ఈ యువ ఆటగాడిలో మెండుగా ఉందని, బౌలర్ ఎవరనేది చూడకుండా మైదానం నలుమూలలా షాట్లు ఆడగల సామర్థ్యం అతనికి ఉందని ప్రశంసించాడు. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ నిర్మించడానికి కొంత సమయం తీసుకుంటాడని, కానీ వైభవ్ మాత్రం పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను మలుపు తిప్పగలడని చోప్రా వివరించాడు. ఈ దూకుడే అతడిని లీగ్‌లోనే అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్‌గా నిలబెట్టిందని స్పష్టం చేశాడు.

విరాట్ కోహ్లీ శైలి వేరు.. కానీ!

నిస్సందేహంగా విరాట్ కోహ్లీ ఒక లెజెండ్ అని, ఐపీఎల్‌లో ఓపెనర్‌గా అతడు సాధించిన శతాబ్దాలు, పరుగులు ఎవరికీ సాధ్యం కానివని ఆకాశ్‌ చోప్రా అంగీకరించాడు. అయితే, ప్రస్తుతం టీ20 ఫార్మాట్ వేగంగా మారిపోతోందని, ఇన్నింగ్స్ ఆరంభంలోనే అత్యధిక స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టే ఓపెనర్ల అవసరం జట్లకు ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చాడు. ఈ కోణంలో చూసినప్పుడు కోహ్లీ క్లాస్ బ్యాటింగ్‌తో పోలిస్తే, వైభవ్ చూపిస్తున్న మాస్ డిస్ట్రక్షన్ జట్లకు భారీ స్కోర్లు అందించడానికి ఎక్కువగా ఉపయోగపడుతుందని తన విశ్లేషణలో పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

క్రికెట్ విశ్లేషణల్లో ఎప్పుడూ భిన్నమైన అంచనాలు వేసే ఆకాశ్‌ చోప్రా, ఈసారి కోహ్లీని పక్కనపెట్టి వైభవ్‌ను ఉత్తమ ఓపెనర్‌గా ఎంచుకోవడం అభిమానుల్లో పెద్ద చర్చకే దారితీసింది. అనుభవం వర్సెస్ యువ రక్తం అనే ఈ సమీకరణంలో రాబోయే రోజుల్లో వైభవ్ ఏ మేరకు రాణిస్తాడో, కింగ్ కోహ్లీ తన బ్యాట్‌తో వీటికి ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలి.

ఆకాశ్‌ చోప్రా ఎందుకు వైభవ్‌ వైపు మొగ్గు చూపాడంటే..?

విరాట్ కోహ్లీ కెరీర్ స్ట్రైక్ రేట్ 134-138 మధ్య ఉండగా (ఇటీవలి కాలంలో 150+ మెరుగైనప్పటికీ), వైభవ్ సూర్యవంశీ కెరీర్ స్ట్రైక్ రేట్ ఏకంగా 224.82 గా ఉంది. క్రీజులోకి వచ్చిన మొదటి బంతి నుంచే విధ్వంసం సృష్టించడం వైభవ్ శైలి. పవర్‌ప్లేను పూర్తిగా వాడుకోవడంలో వైభవ్ చూపిస్తున్న ఇంపాక్ట్ వల్లే ఆకాశ్‌ చోప్రా అతడిని బెస్ట్ ఓపెనర్‌గా పేర్కొన్నాడు.

అనుభవంతోపాటు స్థిరత్వంలో ‘కింగ్’ కోహ్లీ:

ఐపీఎల్ చరిత్రలోనే ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు (2016లో 973 పరుగులు) చేసిన రికార్డు కోహ్లీ పేరిటే ఉంది. ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు (9 సెంచరీలు) బాదిన ఘనత కూడా విరాట్‌దే. వైభవ్ ఇంకా కెరీర్ ఆరంభంలో ఉన్నాడు. కానీ కోహ్లీ దాదాపు రెండు దశాబ్దాలుగా నిలకడగా రాణిస్తున్నాడు.

పరుగుల వేటలో వైభవ్ పైచేయి: ఈ 2026 సీజన్‌లో విరాట్ కోహ్లీ (557 పరుగులు) కంటే వైభవ్ సూర్యవంశీ (583 పరుగులు) మరికొన్ని ఎక్కువ పరుగులతో ముందంజలో ఉన్నాడు.

స్ట్రైక్ రేట్ విధ్వంసం: విరాట్ కోహ్లీ ఈ సీజన్‌లో తన స్ట్రైక్ రేట్‌ను 163.82కు పెంచుకుని అద్భుతంగా ఆడుతున్నప్పటికీ, వైభవ్ సూర్యవంశీ మాత్రం ఏకంగా 232.27 అసాధారణ స్ట్రైక్ రేట్‌తో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.

సిక్సర్ల కింగ్: ఈ సీజన్‌లో వైభవ్ ఏకంగా 53 సిక్సర్లు బాది అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్‌గా నిలిచాడు. కాగా విరాట్ కోహ్లీ యాంకర్ రోల్ పోషిస్తూనే 59 ఫోర్లతో నిలకడగా రాణించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us