నంద్యాలలోని ఓ నివాస గృహంలోకి భారీ నాగుపాము చొరబడటంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఇంట్లో పనులు చేసుకుంటున్న కుటుంబ సభ్యులు గదిమూలలో పడగ విప్పిన పామును చూసి కేకలు వేశారు. స్నేక్ క్యాచర్ రజా సమయానికి చేరుకొని పామును చాకచక్యంగా బంధించి, సమీపంలోని అడవిలో సురక్షితంగా వదిలిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.