అసెంబ్లీ ఎన్నికలు 2024

హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 5న ముగిసిన విషయం తెలిసిందే. 61 శాతం పోలింగ్ నమోదైనట్టు భారత ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్రంతో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి. హర్యానా చిన్న రాష్ట్రమే అయినా.. దేశ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. గత 10 ఏళ్లుగా హర్యానాలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ ఎన్నికల్లో కూడా గెలిచి.. హ్యాట్రిక్‌ కొట్టాలని కాషాయ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. అయితే ఎగ్గిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్‌వైపే మొగ్గు చూపాయి.

జమ్మూ కశ్మీర్‌లో మూడు దశలలో 90 స్థానాలకు అక్టోబర్ 1తో ముగిసిన అసెంబ్లీ ఎన్నికలలో 63.88 శాతం ఓటింగ్ నమోదైంది. 10 ఏళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి. ఇక్కడ మాత్రం ఎగ్టిట్ పోల్స్ రిలీజ్ చేసిన సంస్థలు హంగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపాయి.