Freebies in Elections: అదంతా ఓల్డ్ స్టైల్!.. ఇల్లు, బైకు, కారు లేటెస్ట్ వర్షన్.. మరో ‘ఫ్రీ’వార్..
ఓ వైపు ఈ ఎగ్జాంపుల్ కనిపిస్తున్నా సరే.. తమిళనాడులో మళ్లీ అవే ఉచిత పథకాలను అక్కడి నేతలు నమ్ముకోబోతున్నారు. ఇప్పటికే, దేశంలోనే ఎక్కువ ఉచిత పథకాలు అమలవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు అంతకు మించి తాయిలాలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

ఉచిత పథకాలపై సుప్రీం కోర్టు అభిప్రాయం ఏంటో తెలుసా. ఉచిత పథకాలు ముమ్మాటికీ మంచివి కావు అని. రేషన్‌తో పాటు డబ్బులు కూడా ఇస్తుండడంతో ప్రజలు కష్టపడి పని చేసేందుకు ఇష్టపడడం లేదని ఆమధ్య ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజలకు సౌకర్యాలు అందించాలన్న ప్రభుత్వాల ఉద్దేశం మంచివే అంటూనే… దేశ అభివృద్ధిలో లబ్దిదారులను భాగం చేయాలని సూచించింది. సుప్రీంకోర్టు చేసిన కామెంట్‌పై దేశవ్యాప్త చర్చ జరిగింది ఆనాడు. ఇప్పుడు.. టీవీకే పార్టీ అధినేత విజయ్ కారణంగా.. మళ్లీ చర్చ జరుగుతోంది. బిహార్ ఎన్నికలనే తీసుకుందాం. అక్కడా ఉచిత పథకాల రేసు నడిచింది. బట్ ఒక మార్పు చూపించారు బిహారీలు. అలవికాని హామీలకు, అటువంటి పార్టీలకు మేం ఓట్లు వేయం అని నిరూపించారు. ఎన్నికలకు ముందే అక్కడి ఎన్డీయే ప్రభుత్వం 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసింది నితీశ్ సర్కార్. ఆ స్కీమ్.. పేద, మధ్య తరగతిని తెగ ఆకట్టుకుంది. దీంతో.. ప్రతిపక్ష కూటమి తాము అధికారంలోకి వస్తే ఏకంగా 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని చెప్పింది. అయినా సరే.. జనం 125 యూనిట్ల ఉచితానికే ఓటు వేశారు. ఇక ఎన్నికలకు ముందే జీవికా దీదీ స్కీమ్ కింద మహిళల ఖాతాలో 10వేల రూపాయల చొప్పున వేస్తూ వెళ్లింది నితీశ్ సర్కార్. కాని, ప్రతిపక్ష కూటమి 10వేలు కాదు 30వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇది అమలయ్యే పథకం...




