గుండెకు ఏ బెంగా ఉండొద్దంటే రోజూ ఓ అరటి పండు తినాల్సిందే! 

02 March 2026

TV9 Telugu

TV9 Telugu

సీజన్‌తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో అందుబాటులో ఉండే పండు అరటి పండు. ఇందులో ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి

TV9 Telugu

దీంతోపాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దీనిని డైట్‌లో భాగం చేసుకోవడం ద్వారా శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి

TV9 Telugu

ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి అరటి పండ్లు ఎంతో ఉపయోగపడతాయి. రక్తపోటు నియంత్రణకు పొటాషియం అత్యావశ్యకం. ఇది అరటిలో దండిగా ఉంటుంది

TV9 Telugu

ఇంత కీలకమైనదైనా చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. నిజానికి ఆహారం ద్వారా దీన్ని పొందటం పెద్ద కష్టమేమీ కాదు. అరటిపండ్ల మీద దృష్టి పెడితే చాలు

TV9 Telugu

మామూలు సైజు అరటిపండు ఒకటి తిన్నా రోజుకు అవసరమైన పొటాషియంలో 9 శాతం లభించినట్టే. అందుకే అరటిపండ్లు ఎక్కువగా తినేవారికి గుండెజబ్బు ముప్పు 27 శాతం తక్కువని అధ్యయనాలు పేర్కొంటున్నాయి

TV9 Telugu

అరటి పండ్లలో పొటాషియం ఒక్కటే కాదు, గుండె ఆరోగ్యానికి మేలు చేసే మెగ్నీషియం కూడా ఉంటుంది. డొపమైన్‌, క్యాటెచిన్స్‌ వంటి యాంటీఆక్సిడెంట్లూ దండిగా ఉంటాయి

TV9 Telugu

విశృంఖల కణాల అనర్థాలను తగ్గించే ఇవీ గుండె ఆరోగ్యానికి తోడ్పడేవే. డొపమైన్‌ అనగానే హుషారును కలిగించే రసాయనంగానే గుర్తుకొస్తుంది. కానీ అరటిలోని డొపమైన్‌ యాంటీఆక్సిడెంట్‌గానూ పనిచేస్తుంది

TV9 Telugu

అరటిలోని మెగ్నీషియం, పొటాషియం, పీచు మొదలైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. కాబట్టి రోజుకో అరటి పండు తీసుకోవడం అస్సలు మర్చిపోవద్దు