మండే ఎండల్లో చలచల్లని పుచ్చకాయలు తింటే ఎన్ని లాభాలో..!
02 March 2026
TV9 Telugu
TV9 Telugu
ఎండ తాపం రోజు రోజుకూ పెరుగుతుంది. దీంతో ఈ కాలంలో ఎండ వేడిమి నుంచి కాపాడేందుకు పుచ్చకాయ భలేగా పని చేస్తుంది. పుచ్చకాయలో ఎ, సి విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, పీచు, క్యాల్షియంలు విస్తారంగా ఉన్నందున ఇది మంచి పోషకాహారం
TV9 Telugu
శరీరానికి అవసరమైన శక్తినిస్తుంది. మంట, తాపాలను తగ్గిస్తుంది. ఇందులో ఉన్న ఎ-విటమిన్ కంటిచూపును మెరుగుపరిస్తే, సి-విటమిన్ రోగనిరోధకశక్తిని పెంచుతుంది
TV9 Telugu
ఈ కాలంలో తరచుగా పుచ్చకాయ తినడం మంచిది. 92 శాతం నీటితో ఉన్న పుచ్చకాయ తినడం వల్ల గొంతు తడారిపోవడం, ఒంట్లో నీరు ఇంకిపోవడం, డీహైడ్రేషన్ లాంటి సమస్యలు తలెత్తవు
TV9 Telugu
కండరాల నొప్పులను నిరోధిస్తుంది. ఇందులో చెడు కొలెస్ట్రాల్ బొత్తిగా ఉండదు. గుండె జబ్బులను రానీయదు. శరీరాన్ని శుద్ధి చేస్తుంది. చర్మాన్ని సురక్షితంగా ఉంచుతుంది
TV9 Telugu
రక్తంలో చక్కెర స్థాయిని పెరగనివ్వదు. జీర్ణప్రక్రియ సజావుగా ఉంటుంది. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. పుచ్చకాయ తినడం వల్ల ఆకలి తీరిన భావన కలుగుతుంది
TV9 Telugu
ఇంకా ఇంకా తినాలనే తపన ఉండదు. ఈ కారణం వల్ల ఎక్కువ తినాల్సిన అవసరం ఉండదు. ఊబకాయం రాదు. బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది శ్రేష్ఠం. ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి
TV9 Telugu
కీళ్లనొప్పులు రావు. ఆశ్చర్యం ఏమిటంటే ఇది మానసిక ప్రశాంతతను చేకూర్చి మెరుగైన ఆలోచనలకు దారితీస్తుంది. ఇది కొంతవరకూ క్యాన్సర్లను కూడా నివారిస్తుంది
TV9 Telugu
సాధారణంగా లోపలి ఎర్రటి భాగాన్నే తింటాం కానీ పైనున్న చెక్కు కూడా చాలా మంచిది. ఇక పుచ్చ గింజల్లో కూడా గొప్ప పోషకాలుంటాయి. వీటిని ఎండబెట్టి కొద్దిగా వేయించి ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు