AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీహార్ ఎన్నికలు 2025

బీహార్ ఎన్నికలు 2025

బీహార్ ఎన్నికలు 2025: బీహార్‌లోని 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండు విడతల్లో ఎన్నికల నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సిద్ధమవుతోంది. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న నిర్వహిస్తారు. భారతీయ జనతా పార్టీ, జెడి(యు) చెరో 101 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 29 స్థానాల నుంచి బరిలోకి దిగుతోంది. ఉపేంద్ర కుష్వాహా రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం), జితన్ రామ్ మాంఝీ నేతృత్వలోని హెచ్‌వోఎం చెరో 6 స్థానాల్లో పోటీ చేస్తాయి.

బీహార్ అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 22న ముగుస్తుంది. మునుపటి అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్-నవంబర్ 2020లో జరిగాయి. ఎన్నికల తర్వాత, ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆగస్టు 9, 2022న, జెడి(యు) బీజేపీతో తన పొత్తును ముగించింది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

అయితే మారిన రాజకీయ పరిణామాలతో ఆగస్టు 10, 2022న, జెడియు, ఆర్జెడి-కాంగ్రెస్‌ల మహా కూటమిలో చేరింది. కొత్త ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, జనవరి 2024లో, జెడియు మహా కూటమితో తన పొత్తును ముగించింది. నితీష్ కుమార్ మళ్ళీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తరువాత, ఆయన బీజేపీ నేతృత్వంలోని NDA తో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఇంకా చదవండి

Freebies in Elections: అదంతా ఓల్డ్ స్టైల్!.. ఇల్లు, బైకు, కారు లేటెస్ట్ వర్షన్.. మరో ‘ఫ్రీ’వార్..

ఓ వైపు ఈ ఎగ్జాంపుల్ కనిపిస్తున్నా సరే.. తమిళనాడులో మళ్లీ అవే ఉచిత పథకాలను అక్కడి నేతలు నమ్ముకోబోతున్నారు. ఇప్పటికే, దేశంలోనే ఎక్కువ ఉచిత పథకాలు అమలవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు అంతకు మించి తాయిలాలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

పదోసారి బీహార్‌ ముఖ్యమంత్రిగా నితీష్‌ కుమార్‌.. 26మంది మంత్రులతో ప్రమాణం..!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో గురువారం (నవంబర్ 20) నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో 10వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. నితీష్ కొత్త మంత్రివర్గంలోకి ఇరవై ఆరు మంది మంత్రులు చేరారు. ప్రమాణ స్వీకారం తర్వాత, సామ్రాట్ చౌదరి మొదటగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ సిన్హా తరువాత సామ్రాట్, విజయ్ ఇద్దరూ వరుసగా రెండవసారి ఉప ముఖ్యమంత్రులు అయ్యారు.

Bihar: 10వ సారి సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణం.. ఏ పార్టీ నుండి ఎంతమంది మంత్రులు ఉన్నారంటే..?

బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఈరోజు గురువారం (నవంబర్ 20) కొలువుదీరనుంది. ముఖ్యమంత్రి పదవిపై నెలకొన్న ఉత్కంఠ తొలగిపోయింది. బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ బాధ్యతలు చేపడతారు. ఆయన 10వసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీహార్‌కు 19వ ముఖ్యమంత్రి అవుతారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం పాట్నాలోని గాంధీ మైదానంలో జరుగుతుంది.

Bihar New CM: బీహార్ కొత్త ముఖ్యమంత్రిపై ఫుల్ క్లారిటీ.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి కీలక ప్రకటన..!

బీహార్ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ కీలక ప్రకటన చేశారు. ఒక మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వంలో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారని దిలీప్ జైస్వాల్ అన్నారు. ఆయనను నాయకుడిగా ఎన్నుకునే లాంఛనప్రాయ ప్రక్రియ మాత్రమే పూర్తి చేయాల్సి ఉందన్నారు.

కౌన్ బనేగా బీహార్‌ సీఎం.. NDA చర్చల్లో తేలిందేంటి..? కేబినెట్‌ షేరింగ్‌లో ఎవరికెంత..?

బీహార్ ఎన్నికల్లో NDA కూటమి సంచలన విజయం సాధించింది. 243 సీట్లలో ఏకంగా 202 స్థానాలు కైవసం చేసుకుని గ్రాండ్‌ విక్టరీ కొట్టేసింది. ఆర్జేడీ, కాంగ్రెస్‌ పార్టీలను క్లీన్ స్వీప్ చేసేసింది. బీహార్‌-కాషేర్‌ నితీష్‌కుమార్‌ మరో రికార్డ్‌ సృష్టించబోతున్నారా..? 10వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారా..? NDA చర్చల్లో తేలిందేంటి..? అటు కేబినెట్‌ షేరింగ్‌లో ఎవరికెంత..? ఇప్పుడివే అంశాలు ఆసక్తికరంగా మారాయి.

బీహారీలు మత విషాన్ని తిరస్కరించారు.. అభివృద్ధి ఎజెండాను ఆమోదించారుః ప్రధాని మోదీ

బీహార్ ప్రజలకు రాజకీయాలు నేర్పించాల్సిన అవసరం లేదని, వారo ప్రపంచానికి రాజకీయాలను వివరిస్తారని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్‌ సూరత్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ, బీహార్ కుల ఆధారిత రాజకీయాలను తిరస్కరించిందని అన్నారు. బీహార్ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని ఆయన అన్నారు.

చిచ్చురాజేసిన ఓటమి.. కుటుంబం, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు లాలూ ప్రసాద్ కుమార్తె ప్రకటన!

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాజకీయ కుంపటి రాజేసింది. ముఖ్యంగా రాష్ట్రీయ జనతాదళ్ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో చీలిక ఏర్పడింది. లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య సోషల్ మీడియా సైట్ Xలో కుటుంబం నుండి విడిపోతున్నట్లు ప్రకటించారు. తాను వెళ్లిపోవడానికి కారణాలు ఏంటో కూడా కూడా మెల్లగా వివరించారు.

కులం లేదు.. కూటమి లేదు.. ఓటర్‌ నాడి పట్టిన నేత.. వన్ అండ్ ఓన్లీ వన్‌మేన్‌ షో!

ప్రతి ఎన్నికలోనూ మోదీ స్ట్రాటజీ మారుతుంది. ప్రతి రాష్ట్రంలోనూ ఆయన ప్రసంగం తీరు చేంజ్ అవుతుంది. రొడ్డకొట్టుడు ఉపన్యాసాలు, పసలేని విమర్శలు ఆయన నోటి నుంచి రావు. ప్రజలకేం కావాలో, ప్రజలు తన పార్టీ నుంచి ఏం ఆశిస్తున్నారో అర్థం చేసుకున్నాకే ఆయన వ్యూహాలుంటాయి. ఎత్తులుంటాయి. అందుకే కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు నమో జైత్రయాత్ర కొనసాగుతున్నది.

దూసుకెళ్లిన ఎన్డీయే.. చతికిలపడ్డ మహాఘట్ బంధన్‌.. ఓటమికి అసలు కారణం ఆ ఒక్క మాట..!

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్‌ బంధన్‌.. మహా ఓటమి పాలైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి అధికార కూటమి హవా చూపించింది. RJD, కాంగ్రెస్‌ల అడ్రస్‌ గల్లంతయింది. దీనికి కారణం ఒకే ఒక మాట. ఆ మాట వింటే బీహారీల వెన్నులో వణుకు పుడుతుంది. అదే ఈసారి కూడా మహాఘట్ బంధన్‌ని అధికారానికి దూరంగా ఉంచిందా?

జంగల్ రాజ్, కట్టా సర్కార్ ఖతం.. ఈ దెబ్బకు కాంగ్రెస్‌లో మరో చీలిక ఖాయంః ప్రధాని మోదీ

బీహార్‌లో ఎన్డీఏ అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం నుండి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి భారత ప్రధానమంత్రి .. .. .. .. ..