Bihar New CM: బీహార్ కొత్త ముఖ్యమంత్రిపై ఫుల్ క్లారిటీ.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి కీలక ప్రకటన..!
బీహార్ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ కీలక ప్రకటన చేశారు. ఒక మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వంలో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారని దిలీప్ జైస్వాల్ అన్నారు. ఆయనను నాయకుడిగా ఎన్నుకునే లాంఛనప్రాయ ప్రక్రియ మాత్రమే పూర్తి చేయాల్సి ఉందన్నారు.

మంగళవారం (నవంబర్ 18) ఉదయం 10 గంటలకు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బీజేపీ శాసనసభా పార్టీ సమావేశం జరుగుతుందని ఆయన అన్నారు. అక్కడ పార్టీ నాయకుడిని ఎంపిక చేస్తామన్నారు. ఆ తర్వాత ఎన్డీఏ శాసనసభా పార్టీ సమావేశం జరుగుతుందని, నితీష్ కుమార్ అధికారికంగా నాయకుడిగా ఎన్నికవుతారని ఆయన అన్నారు. పాట్నాలోని గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారని జైస్వాల్ పేర్కొన్నారు.
Patna | Bihar BJP President Dilip Jaiswal met CM Nitish Kumar at the CM's residence.
Source: BJP Bihar pic.twitter.com/G41fefWXYc
— ANI (@ANI) November 16, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…