మూడు మెట్రో స్టేషన్ల పేర్ల మార్పు.. ముఖ్యమంత్రి కీలక ప్రకటన..!
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా సంచలన నిర్ణయం తీసుకున్నారు. పితంపుర ప్రాంతంలోని మూడు మెట్రో స్టేషన్ల పేరు మారుస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణీకుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి, స్థానికత గుర్తింపును గౌరవించడానికి ఈ చర్య తీసుకుంటున్నట్లు ఆమె చెప్పారు. ఈ మార్పులు స్థానిక నివాసితులకు ఈ ప్రదేశం గుర్తింపు, చరిత్రతో మరింత అనుసంధానం అవుతాయని ముఖ్యమంత్రి చెప్పారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా సంచలన నిర్ణయం తీసుకున్నారు. పితంపుర ప్రాంతంలోని మూడు మెట్రో స్టేషన్ల పేరు మారుస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణీకుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి, స్థానికత గుర్తింపును గౌరవించడానికి ఈ చర్య తీసుకుంటున్నట్లు ఆమె చెప్పారు. హైదర్‌పూర్ గ్రామంలో జరిగిన “శ్రేష్ఠ భారత్ సంపర్క్ యాత్ర” కార్యక్రమంలో సీఎం గుప్తా ఈ ప్రకటన చేశారు.
1962లో జరిగిన రెజాంగ్ లా యుద్ధంలో మరణించిన సైనికుల జ్ఞాపకార్థం ఈ ఊరేగింపు నిర్వహించారు. ఆ యుద్ధంలో 13వ కుమావోన్ రెజిమెంట్‌కు చెందిన 114 మంది సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. అమరవీరులకు నివాళులర్పించిన తర్వాత, హైదర్‌పూర్ గ్రామం అభివృద్ధి చెందుతున్న ఢిల్లీకి ఒక ముఖ్య లక్షణంగా మారుతోందని, ఇక్కడ సంప్రదాయం, ఆధునికత సమతుల్యత స్పష్టంగా కనిపిస్తుందని సీఎం గుప్తా అన్నారు. అయితే ఈ సందర్భంగా మూడు మూడు ఢిల్లీ మెట్రో స్టేషన్ల పేర్లు మారుస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తా తన సోషల్ మీడియా ‘X’ ఖాతా పోస్ట్‌లో 3 మెట్రో స్టేషన్ల ప్రతిపాదిత కొత్త పేర్లను కూడా పంచుకున్నారు.
ఈ స్టేషన్లకు కొత్త పేర్లుః
QU బ్లాక్‌లోని ప్రతిపాదిత నార్త్ పితంపుర స్టేషన్ పేరును నార్త్ పితంపుర-ప్రశాంత్ విహార్ మెట్రో స్టేషన్‌గా మార్చనున్నారు.
ప్రతిపాదిత పితాంపుర నార్త్ మెట్రో స్టేషన్ పేరును హైదర్‌పూర్ విలేజ్ మెట్రో స్టేషన్‌గా మార్చనున్నారు.
ప్రస్తుతం ఉన్న పితాంపుర మెట్రో స్టేషన్ పేరును మధుబన్ చౌక్ మెట్రో స్టేషన్ గా మార్చనున్నారు.
ఈ మార్పులు స్థానిక నివాసితులకు ఈ ప్రదేశం గుర్తింపు, చరిత్రతో మరింత అనుసంధానం అవుతాయని ముఖ్యమంత్రి చెప్పారు.
ఇదిలావుంటే, మాక్స్ హాస్పిటల్ రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయని సీఎం గుప్తా పేర్కొన్నారు. ట్రాఫిక్ రద్దీ, అసౌకర్యాన్ని తగ్గించడానికి అండర్‌పాస్‌ను కూడా నిర్మిస్తున్నామని సీఎం తెలిపారు. నగరంలోని ప్రతి ప్రాంతంలో మెరుగైన, సున్నితమైన, సురక్షితమైన రవాణా సౌకర్యాలను అందించడమే ఢిల్లీ ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు.
మెట్రో స్టేషన్ల పేరు మార్చడం, రోడ్డు మౌలిక సదుపాయాల మెరుగుదలలు పితంపురా పరిసర ప్రాంతాల నివాసితులకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తాయని భావిస్తున్నారు. పేరు మార్చడం వలన ఈ ప్రదేశం గుర్తించడం సులభతరం అవుతుందని, ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని స్థానికులు అంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




