ఆ ఒక్క ఘటన జరగకపోతే స్టార్ హీరోయిన్ అయ్యేది.. ఇప్పుడు ఇలా..

Rajitha Chanti

Pic credit - Instagram

02 March 2026

నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ గ్లామర్ బ్యూటీ నభా నటేష్. అందం, అభినయంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

మొదటి సినిమాతోనే ఒక్కసారిగా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. కానీ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

ఈ మూవీ తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. కానీ అదే సమయంలో యాక్సిడెంట్ కావడంతో చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండిపోయింది ఈ భామ.

 ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చిన నభా నటేష్.. వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. ప్రస్తుతం స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తుంది ఈ అమ్మడు. 

ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ స్వయంభు, నాగబంధం అనే రెండు విభిన్న జానర్లలో సినిమాలు చేస్తుంది. అలాగే మరిన్ని అవకాశాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. 

తాజాగా ఇన్ స్టాలో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఆరెంజ్ లంగావోణిలో రాధగా ముస్తాబై మరింత అందగా ఆకట్టుకుంటుంది. 

తాజాగా ఈ అమ్మడును ఇంత అందంగా చూసి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఫ్యాన్స్. రాధ గెటప్ లో ఈ అమ్మడు  మరింత అందంగా, చూడముచ్చటగా ఉందంటున్నారు.

ప్రస్తుతం నభా నటేష్ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఈ అమ్మడు తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటున్నట్లు టాక్.