AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO: హమారా ఇస్రో మహాన్.. ఇప్పటి నుంచి మరో లెక్క.. చంద్రయాన్‌, గగన్‌యాన్‌ ప్రయోగాలపై కీలక అప్‌డేట్‌..

ఇస్రో ప్రస్తుతం అత్యంత బిజీగా మారిందన్నారు ఛైర్మన్‌ నారాయణన్‌. ఈ ఏడాదితోపాటు.. వచ్చే కొన్నేళ్లలో ఇస్రో ముందున్న లక్ష్యాలను వివరించిన ఆయన.. గగన్‌యాన్‌, చంద్రయాన్‌ మిషన్‌లతో పాటు.. ఇతర ఉపగ్రహాల ప్రయోగాలకు సంబంధించి కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ ఏడాది ముగిసేలోపు మరో ఏడు ప్రయోగాలు లక్ష్యంగా పెట్టుకోగా.. వీటిలో ఒక వాణిజ్య కమ్యూనికేషన్‌ ఉపగ్రహ ప్రయోగంతోపాటు.. PSLV, గగన్‌యాన్‌ మిషన్లు కూడా ఉన్నాయన్నారు.

ISRO: హమారా ఇస్రో మహాన్.. ఇప్పటి నుంచి మరో లెక్క.. చంద్రయాన్‌, గగన్‌యాన్‌ ప్రయోగాలపై కీలక అప్‌డేట్‌..
Isro
Ch Murali
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Nov 17, 2025 | 12:57 PM

Share

వరుస ప్రయోగాలతో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న ఇస్రో.. రాబోయే రోజుల్లోనూ కీలక ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టబోతోంది. గగన్‌యాన్‌, చంద్రయాన్‌ మిషన్‌లతో పాటు మరికొన్ని రాకెట్లను ప్రయోగించబోతున్నట్లు ఇస్రో ప్రకటించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రాబోయో ఐదు సంవత్సరాల వ్యవధిలో కేవలం భారత్ ప్రయోజనాల కోసమే 60కి పైగా రాకెట్ ప్రయోగాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇక ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాల సంఖ్య అయితే లెక్కేలేదు.. అలాగే రానున్న నాలుగు నెలల్లో కీలక ప్రయోగాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ఇస్రో తెలిపింది. ముందుగా అమెరికాకు చెందిన ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించనుంది. ప్రయోగాల పరంపలోనే ఈ ఏడాది డిసెంబర్ లో Lvm 03M6 రాకెట్ ప్రయోగంతో అమెరికా దేశానికి చెందిన బ్లూ బర్డ్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. అదేవిధంగా Pslv-C62 రాకెట్ ప్రయోగం ద్వారా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఓషియన్ శాటిలైట్ 3A ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. తిరుపతి జిల్లా సతీష్ దావన్ స్పేస్ సెంటర్ షార్ లో రెండు రాకెట్ ప్రయోగాలు చేపట్టేందుకు రాకెట్ అసెంబ్లింగ్ బిల్డింగ్ నందు రెండు రాకెట్ లు కు అనుసంధాన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

అంతేకాకుండా ఈ వార్షిక సంవత్సరంలో ఇస్రో మరో 7 ఏడు రాకెట్ ప్రయోగాలు చేపట్టేందుకు ఇస్రో సిద్ధంగా ఉందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ నారాయణన్ మీడియాకు వెల్లడించారు. అందులో భాగంగానే ఈ ఏడాది వార్షికంలో 5 Pslv రాకెట్ ప్రయోగాలు ఉంటాయని కూడా చైర్మన్ తెలిపారు. ఈ వరుస రాకెట్ ప్రయోగాల పరంపరలో ఇస్రో కులశేఖర పట్నంలో ఒక లాంచ్ ప్యాడ్ ను ఏర్పాటు చేయడంతో పాటుగా తిరుపతి జిల్లా శ్రీహరికోటలో కూడా మరో మూడవ లాంచ్ ప్యాడ్ ను నూతనంగా ఏర్పాటు చేసిన తరువాత ఇస్రో స్వదేశీ రాకెట్ ప్రయోగాలతో పాటు విదేశీ ఉపగ్రహాలను సైతం వాణిజ్య పరమైన రాకెట్ ప్రయోగాలు ప్రయోగించే కార్యక్రమాల్లో ఇస్రో చాలా కీలక పాత్ర పోషిస్తుందని ఇస్రో అంచనాలు చెబుతున్నాయి.అంతే కాకుండా ఇస్రో pslv వాహనంలో సరికొత్త టెక్నాలజీ తో pslv..N1 సిరీస్ తో కొత్త టెక్నాలజీతో pslv లో కొత్త తరహా రాకెట్ ప్రయోగాలు చేపట్టేందుకు ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

కీలక ప్రయోగాలతోపాటు.. అంతరిక్షంలో స్పేస్ స్టేషన్

ఈ నేపథ్యంలోనే రాబోయే కొన్ని నెలల్లో భారీ స్థాయిలో రాకెట్ ప్రయోగాలు చేయనుందని ఇస్రో అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగానే గగన్ యాన్ ప్రయోగం, చంద్రయాన్ 4 రాకెట్ ప్రయోగాలు చేపట్టే దిశలో ఇస్రో అత్యంత బిజీ బిజీ గా మారనుందని తెలుస్తోంది. అలాగే ఈ ఏడాది లో మరో 7 రాకెట్ ప్రయోగాలు కూడా చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇస్రో ఇప్పటికే ప్రయోగించి ఉన్న చంద్రయాన్ ప్రయోగంలో చంద్రుని పై నీటి జాడలు కనిపించినట్లు సమాచారం ఇచ్చిన ఇస్రో.. చంద్రయాన్ 4 రాకెట్ ప్రయోగం ద్వారా చంద్రుని నుంచి మట్టినమూనాలు సేకరించి భూమి మీదకు తీసుకురావడం లాంటి భారీ ప్రయోగాలు చేయనున్నట్లు సమాచారం. జాబిలి నుంచి మట్టి నమూనాలు తీసుకువచ్చే దేశాలు ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇస్రో కూడా ఈ తరహా ప్రయోగం చేసి ప్రపంచ దేశాలలో నాల్గవ దేశంగా నిలవనుంది. అంతేకాకుండా చంద్రుని దక్షణ ద్రువం వైపు ఉన్న మంచుని కూడా అధ్యయనం చేయడం చంద్రయాన్ మిషన్ లక్ష్యం.. అలాగే ఇస్రో అంతరిక్షంలో సొంత స్పేస్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఉన్న దేశాల్లో భారత్ మూడవ దేశంగా నిలవనుంది.

ఈ క్రమంలో ఇస్రో గగన్ యాన్ రాకెట్ ప్రయోగం ద్వారా చంద్రుడి ఉపరితలంపైకి వ్యోమగాములను పంపి సురక్షితంగా భూమి మీదకు తీసుకు వచ్చే కల 2040 కల్లా నిజం అవుతుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ తెలిపారు. అయితే అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపే ముందు గగనయాన్ ప్రయోగానికి సంబంధించిన మరో మూడు మానవరహిత ప్రయోగాలు చేయాలని సూచించారు. 2027 లో అంతరిక్షంలోకి తొలిసారిగా మానవులను పంపే ప్రక్రియ కూడా ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..