AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jeffing Fitness Trend 2026: పరుగెత్తడం కష్టంగా అనిపిస్తోందా? ‘జెఫింగ్’ పద్ధతిని ఫాలో అవ్వండి!

ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడంతో చాలా మంది రన్నింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫిట్‌నెస్‌ను పెంచుకోవడమే కాకుండా, మానసిక ప్రశాంతత కోసం పరుగును కూడా ఒక అలవాటుగా మార్చుకుంటున్నారు. అయితే ప్రారంభంలో పరుగెత్తడం చాలా మందికి కష్టంగా అనిపిస్తుంది.

Jeffing Fitness Trend 2026: పరుగెత్తడం కష్టంగా అనిపిస్తోందా? ‘జెఫింగ్’ పద్ధతిని ఫాలో అవ్వండి!
Jeffing.jpg
Nikhil
|

Updated on: Mar 02, 2026 | 9:55 PM

Share

కొద్ది దూరం వెళ్లగానే ఊపిరి అందకపోవడం, కండరాల నొప్పులు రావడం సహజం. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ఇప్పుడు ‘జెఫింగ్’ అనే సరికొత్త ఫిట్‌నెస్ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. ఇది పరుగును సులభతరం చేయడమే కాకుండా, లక్ష్యాలను చేరుకోవడంలో ఎంతో సహాయపడుతుంది.

ఒలింపిక్ స్థాయిలో రాణించిన ఒక అథ్లెట్.. సామాన్యుల కోసం ఒక వినూత్న పద్ధతిని కనిపెట్టారు. సాధారణంగా పరుగెత్తేటప్పుడు ఆగకుండా వెళ్లాలని అందరూ అనుకుంటారు, కానీ ఆయన మాత్రం మధ్యలో నడవమని చెబుతున్నారు. అదేంటి పరుగు మధ్యలో నడక ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రన్నర్లకు ఒక వరంలా మారింది. వేలాది మంది తల్లులు తమ ఫిట్‌నెస్ ప్రయాణాన్ని ఈ పద్ధతితోనే ప్రారంభించారు. ఇటీవల 80 ఏళ్ల వయసులో కన్నుమూసిన ఆ లెజెండరీ రన్నర్ పేరు మీద వచ్చిన ట్రెండ్ జెఫింగ్.

జెఫింగ్ అంటే..

జెఫింగ్ అనేది ఒక క్రమబద్ధమైన ‘రన్-వాక్’ ఇంటర్వెల్ శిక్షణ పద్ధతి. దీనిని ఒలింపిక్ రన్నర్ జెఫ్ గాలోవే ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. ఇందులో నిర్ణీత సమయం పరుగెత్తడం, ఆ తర్వాత కాసేపు వేగంగా నడవడం మళ్ళీ పరుగెత్తడం జరుగుతుంది. ఈ పద్ధతి వల్ల స్టామినా పెరుగుతుంది, గాయాల ముప్పు తగ్గుతుంది మరియు అతి త్వరగా అలసిపోకుండా ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. ఈ పద్ధతికి ‘జెఫింగ్’ అనే పేరు ‘రన్ మమ్మీ రన్’ అనే సోషల్ మీడియా గ్రూప్ ద్వారా వచ్చింది. తమ ఆరోగ్యం కోసం పరుగును ఎంచుకున్న తల్లులు, జెఫ్ గాలోవే పద్ధతిని అనుసరిస్తూ దీనికి ప్రేమతో ‘జెఫింగ్’ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిపోయింది.

  • కొత్తగా మొదలుపెట్టేవారు 30 సెకన్లు పరుగెత్తి, 30 సెకన్లు నడవాలి. మధ్యస్థ స్థాయి వారు 3 నిమిషాల పరుగు తర్వాత 1 నిమిషం నడకను ఎంచుకోవచ్చు.
  • ఊపిరి ఆగిపోయే వరకు వేచి ఉండకుండా, పరుగు మొదలుపెట్టిన మొదటి నిమిషం నుండే ఈ ఇంటర్వెల్స్ పాటించాలి.
  • నడిచేటప్పుడు పూర్తిగా ఆగిపోకూడదు. గుండె వేగం తగ్గకుండా చురుగ్గా నడవాలి.
  • స్నేహితులతో మాట్లాడుతూ పరుగెత్తగలిగేంత వేగంతోనే వెళ్లాలి. వీపు, భుజాలు తిన్నగా ఉంచాలి.

ఈ పద్ధతి వల్ల కీళ్లు, కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది. దీనివల్ల వ్యాయామం తర్వాత వచ్చే కండరాల నొప్పులు తక్కువగా ఉంటాయి. ఇది కేలరీలను సమర్థవంతంగా దహించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అనుభవజ్ఞులైన రన్నర్లు సైతం ఈ పద్ధతి ద్వారా సుదూర రేసులను మరింత వేగంగా పూర్తి చేయగలుగుతున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి కష్టపడటమే కాదు, తెలివిగా వ్యాయామం చేయడం కూడా ముఖ్యమని జెఫింగ్ నిరూపిస్తోంది. పరుగును ఒక భారంగా కాకుండా ఆనందంగా మార్చుకోవడానికి ఈ పద్ధతి చక్కగా ఉపయోగపడుతుంది.

Follow Us