కోనసీమలో మళ్లీ నాటి పెళ్లి సంబరం.. ఎడ్లబండిపై తరలివచ్చిన పెళ్లికూతురు !
పెళ్లంటే పచ్చని పందిళ్లు.. మామిడితోరణాలతో, రకరకాల పూలతో అలంకరించిన వేదికపై అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. ఇక పెళ్లి ఊరేగింపు అంటే.. కార్లలో ఊరేగేవాళ్లు కొందరైతే.. రథాలను పోలిన రకరకాల వాహనాలపై ఊరేగేవారు ఇంకొందరు. అందులోనూ కోనసీమలో పెళ్లంటే.. ఇక చెప్పనక్కర్లేదు. ఓ సినిమాలో కథానాయిక.. కోనసీమ కొబ్బరాకుతో పందిరెయ్యాలి మన ఇళ్లకు.. అని కోరుకుంటుంది.
అలాగే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న భాగ్య సుష్మ అనే ఈ కోనసీమ పెళ్లికూతురు కూడా తన పెళ్లి ఊరేగింపు సంప్రదాయబద్ధమైన ఎడ్లబండిలో సాగాలని కోరుకుంది. కూతురు కోరిందే తడవుగా.. బండెనక బండి కట్టి..పదహారు బండ్లు కట్టి.. అన్నట్టుగా.. ఆమె తండ్రి కుమార్తె పెళ్లి ఊరేగింపుకోసం ఎడ్లబండ్లను సిద్ధం చేశాడు. మరి ఆ పెళ్లి ఊరేగింపు ఎలా సాగిందో మీరే చూడండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం ఎ.వేమవరప్పాడు గ్రా మానికి చెందిన రావూరి అయ్యేశ్వరరావు,ప్రభావతి దంపతుల ఏకైక కుమార్తె భాగ్య సుష్మకు అంబాజీపేట మండలం కొర్లపాటి వారి పాలెం గ్రామానికి చెందిన పరసా బాలాజీరామ్, శ్రీదేవీ దంపతుల కుమారుడు మనోజ్ వివాహావేడుక వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పెళ్లి కుమార్తె ఎడ్లబండిపై ఊరేగుతూ వివాహ వేదిక వద్దకు చేరుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని వీడియోల కోసం :
ఆహా అనిపిస్తున్న పోచమ్మ ట్రైలర్!
ఎన్టీఆర్ బీస్ట్ మోడ్.. కొత్త లుక్‌తో తారక్ సర్‌ప్రైజ్
షారుఖ్ ప్లేస్‌ని రణ్‌వీర్ కొట్టేస్తారా?
కోలీవుడ్‌లో సీక్వెల్స్ జోరు
ఓరి మీ కక్కుర్తి కూలా.. ఇదేం పనిరా సామీ!
వాట్ ఏన్ ఐడియా టీచర్ జీ.. అగ్గిపెట్టెలతో అటెండెన్సా!
లక్ష ఇస్తే.. 2 లక్షలు చేస్తాం.. మాయా లేదు మంత్రం లేదు!
ఎనర్జీ డ్రింక్ టిన్‌లో ఇరుక్కున్న పాము.. బయటికి రాలేక విలవిల
తిరుమలలో పాలలా మారిన నీళ్లు.. తిరుమలలో పాలలా మారిన నీళ్లు..
పక్షుల గూటిలో వింత శబ్దాలు.. ఏం జరిగిందో తెలుసా?
యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!

