AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Disease: మహిళల్లో గుండె జబ్బులు.. పురుషులకు భిన్నం! నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!

Heart Disease: మహిళల్లో గుండె జబ్బులు.. పురుషులకు భిన్నం! నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!

Phani CH
|

Updated on: Oct 01, 2026 | 5:18 PM

Share

మహిళల్లో గుండెపోటు లక్షణాలు పురుషులతో పోలిస్తే భిన్నంగా ఉండొచ్చని కార్డియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఛాతీ నొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అసాధారణ అలసట, వికారం, అజీర్తి, చెమటలు, తల తిరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. వీపు, భుజాలు, దవడ లేదా పొట్ట పైభాగంలో అసౌకర్యం కూడా గుండె సమస్యకు సంకేతం కావచ్చు. వీటిని సాధారణ ఒత్తిడి లేదా అజీర్తిగా భావించి నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రపంచ హృదయ దినోత్సవం .. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మహిళల్లో వచ్చే గుండె జబ్బులపై కార్డియాలజిస్టులు అత్యంత కీలకమైన విషయాలను వెల్లడించారు. గుండెపోటు అనగానే ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడం, ఎడమ చేయి గుంజడం వంటి లక్షణాలే మనకు గుర్తొస్తాయి. అయితే, ఇవి పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తాయని, మహిళల్లో మాత్రం గుండెపోటు లక్షణాలు చాలా భిన్నంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పురుషుల్లో గుండెపోటు వచ్చినప్పుడు ఛాతీపై ఒత్తిడి, నొప్పి.. దవడ లేదా చేతికి పాకడం సాధారణం. మహిళల్లోనూ ఈ లక్షణాలు ఉండవచ్చని, కానీ వీటికి అదనంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అసాధారణమైన అలసట, వికారం, జీర్ణ సమస్యలు, చెమటలు పట్టడం, తల తిరగడం వంటివి కూడా ఉంటాయని ఆయన వివరించారు. ముఖ్యంగా వీపు, భుజాలు, దవడ లేదా పొట్ట పైభాగంలో అసౌకర్యంగా అనిపించడం కూడా గుండె సమస్యకు సంకేతం కావచ్చన్నారు. ఈ లక్షణాలు ఛాతీ నొప్పితో కలిసైనా రావచ్చు.. లేదా అది లేకుండా అయినా రావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలను మహిళలు తరచుగా సాధారణ ఒత్తిడి, ఆందోళన లేదా అజీర్తి అనుకుని నిర్లక్ష్యం చేయడం వల్ల ముప్పు పెరుగుతోంది. మహిళల శరీర నిర్మాణం, హార్మోన్ల వ్యత్యాసాలు, రక్తనాళాల అమరిక ఇందుకు ప్రధాన కారణాలు. ముఖ్యంగా మహిళల్లో పెద్ద ధమనులలో అడ్డంకులు లేకపోయినా, ‘కొరొనరీ మైక్రోవాస్కులర్ డిస్‌ఫంక్షన్’ అనే చిన్న రక్తనాళాల సమస్య వల్ల నొప్పి, అలసట వస్తుంటాయి. అంతేకాకుండా, గర్భధారణ సమయపు సమస్యలు, మెనోపాజ్ తర్వాత వచ్చే హార్మోన్ల మార్పులు కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే మహిళలు తమ శరీరంలో కనిపించే చిన్నపాటి అసాధారణ మార్పులను కూడా తేలిగ్గా తీసుకోకూడదని, క్రమం తప్పకుండా ముందస్తు గుండె పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pulses Rates: పండగవేళ సామాన్యుడికి షాక్‌.. పప్పుల ధరలకు రెక్కలు

కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డబ్బుతో డ్యాన్స్ చేస్తూ మరో రీల్!

పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూలుకు మాస్టర్‌ ప్లాన్‌.. ఇక ఎవరూ తప్పించుకోలేరు!

పెరగనున్న ఏసీ, టీవీ, ఫ్రిజ్‌ల ధరలు

Follow Us