AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెరగనున్న ఏసీ, టీవీ, ఫ్రిజ్‌ల ధరలు

పెరగనున్న ఏసీ, టీవీ, ఫ్రిజ్‌ల ధరలు

Phani CH
|

Updated on: Oct 01, 2026 | 5:24 PM

Share

పండగ సీజన్ ఆరంభంలోనే ఏసీ, టీవీ, ఫ్రిజ్‌లతో సహా గృహోపకరణాల ధరలు పెరగనున్నాయి. అక్టోబర్ 1 నుంచి ఐదు నుంచి ఎనిమిది శాతం మేర ధరలు పెరుగుతాయి. ముడిసరుకుల ధరల పెరుగుదల, రవాణా ఖర్చులు, కరెన్సీ హెచ్చుతగ్గులు దీనికి ప్రధాన కారణాలు. పాత స్టాక్ దీపావళి వరకు అందుబాటులో ఉండనుంది.

పండగ సీజన్ ప్రారంభమవుతుండగా, వినియోగదారుల జేబులపై పెనుభారం పడనుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఏసీలు, ఎల్ఈడీ టీవీలు, వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి కీలక గృహోపకరణాల ధరలు గణనీయంగా పెరగనున్నాయి. ఈ ఏడాదిలో ఇది మూడోసారి ధరల పెంపు కావడం గమనార్హం. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, అంతర్జాతీయంగా రాగి, ఉక్కు, అల్యూమినియం వంటి ప్రధాన ముడిసరుకుల ధరలు భారీగా పెరగడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. వీటితో పాటు రవాణా ఖర్చులు పెరగడం, పశ్చిమాసియా సంక్షోభం కారణంగా కరెన్సీ మారకపు విలువలో హెచ్చుతగ్గులు రావడంతో ఉత్పత్తుల తయారీ వ్యయం అధికమైందని ప్రముఖ సంస్థలు వెల్లడించాయి. ఏసీల ధరలు ఐదు నుంచి ఎనిమిది శాతం మేర పెరుగుతూ ఉండగా, టీవీలు, వాషింగ్ మెషిన్ల ధరలు మూడు నుంచి నాలుగు శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే, పండగ షాపింగ్ చేయాలనుకునే వారికి ఒక చిన్న ఊరట లభించనుంది. డీలర్ల వద్ద ఇప్పటికే ఉన్న పాత నిల్వలు ఒకటి నుంచి ఒకటిన్నర నెలల పాటు అందుబాటులో ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందువల్ల, విజయదశమి, దీపావళి వరకు వినియోగదారులు పాత ధరలకే ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీపావళి పండుగ తర్వాతే కొత్త ధరలు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తాయని నిపుణులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

FD Rules: ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి ఎఫ్‌డీ నిబంధనల్లో మార్పులు

ఆ ఒక్క మార్పుతో రెచ్చిపోతోన్న కోహ్లీ.. కింగ్ బ్యాటింగ్ సీక్రెట్ చెప్పేసిన గిల్

ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన…సంస్థ ఇచ్చిన పరిహారం ఎంతో తెలుసా?

Asian Games 2026: ఏషియన్‌ క్రీడల్లో గుల్వీర్ సింగ్ మెరుపు.. 1500 మీటర్లలో రజతం కైవసం!

ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు

Published on: Oct 01, 2026 05:01 PM
Follow Us