FD Rules: ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి ఎఫ్‌డీ నిబంధనల్లో మార్పులు
ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించి ఆర్‌బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ముఖ్యంగా రూ.3 కోట్లు, అంతకంటే ఎక్కువ మొత్తంలోని బల్క్ డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీ రేట్లను మరింత పారదర్శకంగా వెల్లడించేలా మార్పులు చేసింది. బ్యాంకులు ప్రకటించిన రేట్లకు అనుగుణంగానే డిపాజిట్లపై వడ్డీ వర్తించనుంది. సాధారణ రిటైల్ ఎఫ్‌డీలపై ఈ మార్పుల ప్రభావం ఉండదు. ఇప్పటికే ఉన్న ఎఫ్‌డీలకు ఒప్పందం ప్రకారం వడ్డీ కొనసాగుతుంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసే వారి కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. బ్యాంకులు అందించే వడ్డీ రేట్లలో మరింత పారదర్శకత, స్థిరత్వం తీసుకురావడమే లక్ష్యంగా రూపొందించిన ఈ విధానం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మార్పులు ప్రధానంగా రూ. 3 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తంలో చేసే ‘బల్క్ డిపాజిట్ల’కు వర్తిస్తాయి. బ్యాంకులు తమ బల్క్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్లను బ్యాంక్ వర్కింగ్ డేస్‌లో ప్రతిరోజు ఉదయం 10 గంటలలోపు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించాలి. మార్పుల కోసం 10 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. వెబ్‌సైట్‌లో ప్రకటించిన వడ్డీ రేటునే ఆ రోజు డిపాజిట్ చేసే కస్టమర్లకు అందించాలి. అలాగే, ఇప్పటివరకు ఒకే బ్యాంకులోని వేర్వేరు బ్రాంచ్‌లలో బల్క్ డిపాజిట్లకు స్వల్పంగా వేర్వేరు వడ్డీ రేట్లు ఇచ్చే అవకాశం ఉండేది. ఇకపై ఒకే రోజు, ఒకే బ్యాంకుకు చెందిన ఏ బ్రాంచ్‌లో డిపాజిట్ చేసినా ఒకే రకమైన వడ్డీ రేటు వర్తిస్తుంది. ఈ కొత్త నిబంధనల వల్ల చిన్న, మధ్యతరగతి రిటైల్ డిపాజిటర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాధారణ కస్టమర్లకు ప్రస్తుతం ఉన్న నిబంధనలే కొనసాగుతాయి. అలాగే, ఇప్పటికే చేసిన పాత ఎఫ్‌డీలకు వాటి గడువు ముగిసే వరకు పాత వడ్డీ రేట్లే అమలవుతాయి. ఈ నిబంధనలు షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులతో సహా అన్ని రకాల బ్యాంకులకు వర్తిస్తాయి. బల్క్ డిపాజిట్లు చేసేవారు తాము డిపాజిట్ చేసే రోజున బ్యాంకు వెబ్‌సైట్‌లో ఉన్న వడ్డీ రేట్లను సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ ఒక్క మార్పుతో రెచ్చిపోతోన్న కోహ్లీ.. కింగ్ బ్యాటింగ్ సీక్రెట్ చెప్పేసిన గిల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన…సంస్థ ఇచ్చిన పరిహారం ఎంతో తెలుసా?
Asian Games 2026: ఏషియన్ క్రీడల్లో గుల్వీర్ సింగ్ మెరుపు.. 1500 మీటర్లలో రజతం కైవసం!
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు
షాకింగ్ సైబర్ క్రైమ్! డెంటల్ డాక్టర్‌కు ఫేస్‌బుక్‌లో లేడీ వల.. రూ.14.61 కోట్లు గోవిందా
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు
డెంటల్ డాక్టర్‌కు ఫేస్‌బుక్‌లో లేడీ వల.. రూ.14.61 కోట్లు గోవిందా
భారతీయ భోజనం మానేశాకే ఫిట్‌గా అయ్యాను!
కూతురికి గుడికట్టి పూజిస్తున్న తండ్రి!
ఆటో డ్రైవర్‌ను వదలని రామచిలుకలు.. ఇంటి మిద్దెపై చేరి..
వామ్మో.. గంటన్నర పాటు పడగ విప్పి నిల్చున్న నాగుపాము

