AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Games 2026: ఏషియన్‌ క్రీడల్లో గుల్వీర్ సింగ్ మెరుపు.. 1500 మీటర్లలో రజతం కైవసం!

Asian Games 2026: ఏషియన్‌ క్రీడల్లో గుల్వీర్ సింగ్ మెరుపు.. 1500 మీటర్లలో రజతం కైవసం!

Phani CH
|

Updated on: Sep 30, 2026 | 5:09 PM

Share

ఏషియన్‌ గేమ్స్‌లో భారత అథ్లెట్‌ గుల్వీర్‌ సింగ్‌ మరో రజత పతకం సాధించాడు. పురుషుల 1500 మీటర్ల ఫైనల్‌లో 3 నిమిషాల 36.72 సెకన్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. జపాన్‌కు చెందిన కజుటో ఇవా స్వర్ణం సాధించగా, మరో జపాన్‌ అథ్లెట్‌ నగాయా మోరీ కాంస్యం గెలిచాడు. ఇప్పటికే 10,000 మీటర్లలో రజతం సాధించిన గుల్వీర్‌ ఈ క్రీడల్లో రెండో పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ మరోసారి అద్భుత ప్రతిభతో ఆకట్టుకున్నాడు. ఏషియన్ క్రీడల్లో తన పరుగుల జోరును కొనసాగిస్తూ దేశానికి రెండో పతకాన్ని అందించాడు. ఉత్కంఠభరితమైన 1500 మీటర్ల పురుషుల ఫైనల్స్‌లో గుల్వీర్ రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే ఇదే క్రీడలో 10,000 మీటర్ల ఈవెంట్‌లోనూ రజత పతకం గెలుచుకున్నాడు. గుల్వీర్ 1500 మీటర్ల పరుగును కేవలం 3 నిమిషాల 36.72 సెకన్లలోనే విజయవంతంగా ముగించాడు. రేసు ఆరంభం నుంచి చివరి క్షణం వరకు తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఫస్ట్ ప్లేస్ వైపు దూసుకెళ్లాడు. అయితే, పోటీ ముగింపు స్టేజ్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఫినిషింగ్ లైన్ సమీపిస్తున్న తరుణంలో జపాన్ స్ప్రింటర్ కజుటో ఇవా అద్భుత వేగంతో పుంజుకున్నాడు. కేవలం 0.37 సెకన్ల స్వల్ప తేడాతో గుల్వీర్‌ను వెనక్కి నెట్టి కజుటో ఇవా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మరోవైపు, 3 నిమిషాల 37.92 సెకన్ల టైమింగ్‌తో జపాన్‌కు చెందిన మరో అథ్లెట్ నగియా మోరీ కాంస్య పతకం సాధించాడు. స్వల్ప తేడాతో స్వర్ణం చేజారినప్పటికీ, ఏషియన్ క్రీడల్లో రెండు రజతాలు సాధించి గుల్వీర్ దేశం గర్వపడేలా చేశాడు. ఈ చారిత్రక విజయంతో భారత క్రీడావర్గాలు, అభిమానులు గుల్వీర్‌పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు

షాకింగ్ సైబర్ క్రైమ్! డెంటల్‌ డాక్టర్‌కు ఫేస్‌బుక్‌లో లేడీ వల.. రూ.14.61 కోట్లు గోవిందా

భారతీయ భోజనం మానేశాకే ఫిట్‌గా అయ్యాను!

కూతురికి గుడికట్టి పూజిస్తున్న తండ్రి!

ఈ ఆకుతో పచ్చడి చేసుకుని తింటే మోకాళ్ల నొప్పులు పరార్!

Follow Us