AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూతురికి గుడికట్టి పూజిస్తున్న తండ్రి!

కూతురికి గుడికట్టి పూజిస్తున్న తండ్రి!

Phani CH
|

Updated on: Sep 30, 2026 | 5:01 PM

Share

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం చుక్కాయిపల్లికి చెందిన రమేష్‌ దంపతులు తమ కుమార్తె గీతిక జ్ఞాపకార్థం గుడిని నిర్మించి ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించారు. 2011లో జన్మించిన గీతిక అనారోగ్యంతో 2024లో 14 ఏళ్ల వయసులో కన్నుమూసింది. తొలిసంతానాన్ని కోల్పోయిన బాధలో ఉన్న తల్లిదండ్రులు, పాప రూపం తమ కళ్లముందే ఉండాలనే ఉద్దేశంతో ఆలయం నిర్మించారు. ప్రతిరోజూ పూజలు, దీపారాధనలు చేస్తూ ఆమెను స్మరించుకుంటున్నారు.

కన్నబిడ్డను కోల్పోయిన బాధను ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఇక లేదనే నిజాన్ని జీర్ణించుకోలేక, ఆమె జ్ఞాపకాలు శాశ్వతంగా నిలిచిపోవాలని ఏకంగా గుడి కట్టించి విగ్రహాన్ని ప్రతిష్టించాడు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం చుక్కాయిపల్లికి చెందిన రమేష్‌ (అచ్చంపేట కోర్టు కానిస్టేబుల్)కు 2011 జూలై 17న గీతిక జన్మించింది. అయితే కాన్పు సమయంలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల పాపకు మెదడు దెబ్బతిని అనారోగ్యానికి గురైంది. ఎంతగానో పోరాడి కాపాడుకోవాలని చూసినా, 14 ఏళ్ల వయసులో 2024 అక్టోబర్ 21న గీతిక కన్నుమూసింది. తొలిసంతానమైన బిడ్డ దూరమవ్వడంతో తీవ్ర మనోవేదనకు గురైన రమేష్ దంపతులు.. పాప రూపం ఎప్పటికీ తమ కళ్లముందే ఉండాలని భావించారు. సొంత ఊరిలోని తమ స్థలంలో గీతిక జ్ఞాపకార్థం ఒక గుడిని నిర్మించి, అందులో ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించారు. దేవతలా భావిస్తూ రోజువారీ పూజలు, దీపారాధన చేస్తున్నారు. పుట్టినరోజు, వర్ధంతి రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ బిడ్డపై ఉన్న అపారమైన ప్రేమను చాటుకుంటున్నారు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ ఆకుతో పచ్చడి చేసుకుని తింటే మోకాళ్ల నొప్పులు పరార్!

ఫోన్ నంబర్ లింక్ చేయకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందా? రవాణా శాఖ క్లారిటీ!

ఆటో డ్రైవర్‌ను వదలని రామచిలుకలు.. ఇంటి మిద్దెపై చేరి..

విజయవాడ జంక్షన్‌లో రైళ్ల రద్దీకి చెక్.. రైల్వే బైపాస్ లైన్‌ నిర్మాణం

వామ్మో.. గంటన్నర పాటు పడగ విప్పి నిల్చున్న నాగుపాము.. అసలేం జరిగింది?

Follow Us