AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆటో డ్రైవర్‌ను వదలని రామచిలుకలు.. ఇంటి మిద్దెపై చేరి..

ఆటో డ్రైవర్‌ను వదలని రామచిలుకలు.. ఇంటి మిద్దెపై చేరి..

Phani CH
|

Updated on: Sep 30, 2026 | 4:46 PM

Share

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా తాళ్లరేవు మండలం చిన్న బొడ్డు వెంకటాయపాలెంలో ఓ ఇంటి మిద్దెపైకి ప్రతిరోజూ వందలాది రామచిలుకలు వస్తున్నాయి. ఆటో డ్రైవర్‌ వాడ్రేవు బాలకృష్ణ పక్షి ప్రేమతో తొలుత ధాన్యం పెట్టగా ఒకట్రెండు చిలుకలు రావడం ప్రారంభమైంది. ప్రస్తుతం రోజుకు ఐదు కేజీల ధాన్యంతో పాటు జామ, యాపిల్‌ వంటి పండ్లను కూడా మూడు పూటలా అందిస్తున్నారు. పరిమిత ఆదాయంతోనే పక్షులను పోషిస్తున్న బాలకృష్ణ కుటుంబాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.

సాధారణంగా ఒకటి రెండు రామచిలుకలు కనిపిస్తేనే మనం ఎంతో సంతోషంగా చూస్తాం. అలాంటిది ఒక ఇంటి మిద్దెపైకి రోజూ వందలాది రామచిలుకలు వస్తే? ఆ దృశ్యాన్ని చూడటానికి రెండు కళ్లు సరిపోవు కదా! డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తాళ్లరేవు మండలం చిన్న బొడ్డు వెంకటాయపాలెంలో సరిగ్గా ఇలాంటి ఘటనే నిత్యకృత్యంగా మారింది. చిన్న బొడ్డు వెంకటాయపాలెం గ్రామానికి చెందిన వాడ్రేవు బాలకృష్ణ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. స్వతహాగా పక్షి ప్రేమికుడైన ఆయన, తొలినాళ్లలో తన ఇంటిపై ధాన్యపు కుచ్చులు కట్టేవారు. వాటిని తినడానికి మొదట్లో ఒకటి రెండు చిలుకలు వచ్చేవి. క్రమంగా ఈ విషయం తెలుసుకున్న మిగతా చిలుకలు గుంపులు గుంపులుగా రావడం మొదలుపెట్టాయి. ఇప్పుడు ఏకంగా వందలాది రామచిలుకలు ఆయన ఇంటి మిద్దెపై సందడి చేస్తున్నాయి. ఆటో నడుపుతూ వచ్చే కొద్దిపాటి సంపాదనలోనే కొంత మొత్తాన్ని ఈ చిలుకల మేత కోసం కేటాయిస్తూ బాలకృష్ణ ఆదర్శంగా నిలుస్తున్నారు. మొదట్లో ఒక కేజీ ధాన్యంతో ప్రారంభించి, ప్రస్తుతం రోజుకు 5 కేజీల ధాన్యాన్ని మూడు పూటలా నానబెట్టి వేస్తున్నారు. వీటితో పాటు జామపళ్లు, యాపిల్స్ వంటి పళ్లను కూడా ఆహారంగా అందిస్తున్నారు. అంతరించిపోతున్న పక్షులను కాపాడేందుకు ఆ కుటుంబం చేస్తున్న కృషిపై స్థానికులు తీవ్ర ప్రశంసలు కురిపిస్తున్నారు. దాతల సహాయం కోసం విజ్ఞప్తి: ఆటో డ్రైవర్‌గా తనకు వచ్చే పరిమిత ఆదాయంతో వందలాది చిలుకలను పోషించడం కొంత భారంగా మారినప్పటికీ, బాలకృష్ణ వెనకడుగు వేయడం లేదు. పక్షి ప్రేమికులు లేదా దాతలు ఎవరైనా ధాన్యం, పళ్ల రూపంలో సహాయం అందిస్తే ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని ఆయన కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విజయవాడ జంక్షన్‌లో రైళ్ల రద్దీకి చెక్.. రైల్వే బైపాస్ లైన్‌ నిర్మాణం

వామ్మో.. గంటన్నర పాటు పడగ విప్పి నిల్చున్న నాగుపాము.. అసలేం జరిగింది?

అయ్యో.. గుడ్లు అనుకొని గోల్ఫ్‌ బాల్స్‌ మింగేసిన పాము.. ఆ తర్వాత

Follow Us