AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. గంటన్నర పాటు పడగ విప్పి నిల్చున్న నాగుపాము.. అసలేం జరిగింది?

వామ్మో.. గంటన్నర పాటు పడగ విప్పి నిల్చున్న నాగుపాము.. అసలేం జరిగింది?

Phani CH
|

Updated on: Sep 30, 2026 | 4:42 PM

Share

విశాఖపట్నంలోని పోతిన మల్లయ్యపాలెంలో ఓ ఇంటి ఆవరణలో సుమారు మూడు అడుగుల ఎత్తున నాగుపాము పడగవిప్పి దాదాపు గంటన్నర పాటు నిల్చుంది. పాము కనిపించగానే కాకులు గుంపుగా చేరి పెద్దగా అరవడంతో కుటుంబ సభ్యులు స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న నాగరాజు పామును జాగ్రత్తగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. కాకులు గుంపుగా పామును వేధించే ‘మాబింగ్‌ బిహేవియర్‌’ దీనికి కారణమై ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

విశాఖలోని పోతిన మల్లయ్యపాలెం స్టేడియం సమీపంలో ఒక అరుదైన, భయాందోళన కలిగించే సంఘటన చోటుచేసుకుంది. ఓ ఇంటి ఆవరణలోని గట్టుపై సుమారు మూడు అడుగుల ఎత్తున పడగవిప్పి, నిటారుగా నిల్చున్న ఒక భారీ నాగుపాము దాదాపు గంటన్నర పాటు అక్కడికక్కడే ఉండిపోయింది. ఇంటి ఆవరణలో ఉన్న పక్షులు, కాకులు ఒకేసారి పెద్ద ఎత్తున అరవడం మొదలెట్టాయి. ఏమై ఉంటుందా అని గమనించిన కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూడగా ఈ దృశ్యం కనిపించింది. పాము అక్కడ నుంచి ఎంతకీ కదలకపోవడంతో భయాందోళనకు గురైన వారు, వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించారు. ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికి కూడా పాము అలాగే పడగవిప్పి ఉండటంతో, ఆ పామును జాగ్రత్తగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సాధారణంగా నాగుపాము తనకు ఆపద ఎదురైందని భావించినప్పుడు ఆత్మరక్షణ కోసం పడగవిప్పి బెదిరిస్తుంది. అయితే ఇక్కడ కాకులకు, పాములకు మధ్య ఉన్న శత్రుత్వమే ఇందుకు ప్రధాన కారణమని జువాలజీ నిపుణులు చెప్తున్నారు. కాకుల గుడ్లను పాములు తింటాయి కాబట్టి, పాము కనిపించగానే కాకులు గుంపుగా చేరి అరుస్తూ ముక్కుతో పొడవడానికి ప్రయత్నిస్తాయి. దీన్ని సైన్స్‌లో ‘మాబింగ్ బిహేవియర్’ అంటారు. కాకుల దాడి నుంచి తనను తాను కాపాడుకోవడానికి, తాను చాలా ప్రమాదకరమైన దాడికి సిద్ధంగా ఉన్నానని హెచ్చరించడానికే ఆ నాగుపాము గంటన్నర పాటు అలా పడగవిప్పి నిటారుగా నిల్చుండిపోయిందని శాస్త్రవేత్తలు విశ్లేషించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయ్యో.. గుడ్లు అనుకొని గోల్ఫ్‌ బాల్స్‌ మింగేసిన పాము.. ఆ తర్వాత

Follow Us